మన పెరట్లో కొలువైవున్న తులసి మొక్కకు ప్రతి నిత్యం మహిళలు పూజలు చేయడం వలన ఎంతో శుభదాయకం చేకూరుతుంది. ఈ కార్తీక మాసంలో తులసిమాతను భక్తి శ్రద్దలతో కొలిచిన వారికి పెళ్లికాని వధువులకు వివాహం జరుగుతుంది.
స్త్రీ సౌభాగ్యానికి ఎనలేని సిరి సంపదలు సంప్రాపిస్తాయి. తమ కోరికలు నెరవేరుతాయి అనే నమ్మకం కనుకనే మహిళలకు సౌభాగ్యం తులసి పూజ అని విశ్వసిస్తారు.
తులసిదళం అంటే శ్రీ కృష్ణుడుకి ఎంతో ఇష్టం. తిరు మల శ్రీవారిని ప్రతినిత్యం తులసీ దళాలతో పూజిస్తారు. మహిళలకు తులసి పూజ అంటే చాలా మక్కువ. హిందూ దేవాలయాలలో జరిగే ప్రతీ పూజలలో తులసి దళం వాడడం అత్యంత్య ప్రాముఖ్యత వహించింది.
‘తులసి కాననం. యత్ర యత్ర పద్మ వనాని
వసంతి వైషవా యత్ర యత్ర సన్నిహి తో హరి
ఎక్కడైతే తులసీవనం పెంచుతారో ఎక్కడైతే కమలముల ఉపవనం విరాజిల్లు తుందో, ఎక్కడైతే వైష్ణవులు నివాసం వుంటారో అక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నివాసం వుంటారు. అని పద్మపురాణంలో వున్నది.
తులసి మొక్క విశిష్ట గురించి ఆయుర్వేదంలో వివరించారు. ప్రతిరోజూ ఉదయం అభ్యంగన స్నానం ఆచరించి స్త్రీలు తులసి మొక్కను పసుపు, కుంకుమలతో భక్తి శ్రద్దలతో పూజించడం తెలుగింటి ఆచారం. ప్రతీ ఇంట్లో తులసి కోట వుంటే అక్కడ శ్రీలక్ష్మి సౌభాగ్య సిరులు సమకూరగలవు. అందుకే తులసి కోట చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తారు
. తులసి దళాలు వివిధ దేవతలకు అర్చనకు అందరూ ఉపయోగిస్తారు. తెలుగువారి ప్రతీ ఇంటా తులసి మొక్క పెంచాలి. ఆయుర్వేదంలో తులసి ప్రాముఖ్యత ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. పంచ తులసి మరియాలు ఔషదాలలో తులసి ఆకును ఉపయోగి స్తారు. దీని వలన చర్మ వ్యాధులు దరిచేరవు. గోదాదేవి తులసిపూజతోనే శ్రీ మహావిష్ణువును ఆరాధించి ప్రసన్నం చేసుకోగలిగింది.
మహా సాద్వీమణి రుక్మిణి దేవి ఒక్క తులసి దళంతో శ్రీ కృష్ణ తులాభారంతో తన విజయం సాధించింది. లోకానికి ఆదర్శంగా నిలిచింది. తులసిఆకుతో చేసిన తీర్థము చనిపోయిన వారి నోట్లో చివరి సారిగా వేస్తారు.
ఎందుకంటే పవిత్రమైన తులసి తీర్థము వలన ఈ దేహం వదిలిన వారి ఆత్మకు శాంతిని ప్రసాధించాలని వారి భావన తులసిలో రామ తులసి, కృష్ణతులసి అనే రెండు రకాలు వున్నాయి. మహిళలకు భక్తి భావనలో తులసి ప్రాధాన్యత సంతరించు కొంది.
తెలుగు వాకిట్లో వెన్నెల దీపం తులసిమాత, తులసి వలన మహిళలకు ఎంతో భక్తి ప్రపత్తులు కలిగి ఉండడం విశేషం. తులసి ఆకులతో ఈ కార్తీక మాసంలో శివుణ్ని పూజించడం ముక్తి దాయకం.
EmoticonEmoticon