మొదలెట్టేశారా? ఉదయం లేవగానే ఏప్రిల్ ఫూల్ అంటూ సన్నిహితులను, కుటుంబ సభ్యులను ఫూల్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారా? ఫూల్స్ డే అనగానే ప్రతీ ఒక్కరిలో ఒక చిన్నపిల్లాడు బయటకు వచ్చేస్తాడు.
సరదాగా అందరినీ పూల్ చేయడం కోసం ఏవేవో గాలి వార్తలు చెబుతుంటారు. విన్నవారు అవునా నిజమా? అని అడిగేసరికి ఏప్రిల్ ఫూల్ అంటూ గట్టిగా నవ్వేస్తారు. ఎక్కడ చూసినా ఆ రోజంతా ఇవే సరదాలు, ఆనందాలు, నవ్వులు. పిల్లలైతే ముందురోజునుంచే ప్లాన్ చేసేస్తారు. ఎలా హడావుడి చేయాలా అని. అయితే అసలు ఈ ఫూల్స్ డే ఎలా వచ్చిందో తెలుసుకోవాలని అనిపిస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఫూల్స్ డే సాంప్రదాయం యూరప్‌లో పుట్టి ప్రపంచానికి పాకింది. 1582కి ముందు.. యూరోప్‌లో మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేవారు. 1582లో మాత్రం జూలియన్
క్యాలెండర్ స్థానంలో 13వ పోప్ గ్రేగరీ ఓ కొత్త క్యాలెండర్‌ని విడుదల చేశారు. దీని ప్రకారం కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఈ నిర్ణయాన్ని అప్పటి అనేక దేశాలు తిరస్కరించాయి. ఆ క్యాలెండర్‌ని అనుసరించమని స్పష్టం చేశాయి. దీంతో గ్రెగోరి తరపున కొంతమంది ప్రజలు నిలిచారు. జనవరి 1న మాత్రమే కొత్తసంవత్సరం వేడుకలు
జరుపుకునేవారు. అంతేకాక.. ఏప్రిల్ ఒకటిన కొత్త సంవత్సరం అని నమ్మేవారిని ఫూల్స్‌గా జమకట్టి ‘ఏప్రిల్
ఫూల్స్’, ‘ఏప్రిల్ ఫిష్’ అంటూ ఏడిపాంచేవారు. ఇలా వచ్చిన ఏప్రిల్ ఫూల్ ప్రపంచమంతా పాకింది.
EmoticonEmoticon