ఫ్రిజ్




మనం రోజూ ఫ్రిజ్ లో అనేక పదార్థాలను నిల్వ ఉంచి ఆతర్వాత వాడుకోవచ్చు అనుకుంటాము. కానీ దానికీ పరి మితులున్నాయి…
క్యాన్సర్ కారక రసాయనాలు ఉద్భవించకుండ, ఆహారపదార్ధాలు విషతుల్యాలుగా
మారకుండ జాగ్రత్తలు తీసుకోవాలి . అలాగే రిఫ్రిజరేటర్ వాడకంలో జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ కాలం మన్నుతుంది. కరెంటు ఖర్చు కూడా తగ్గుతుంది.
*
ఆఖరి దశలో ఉన్న పదార్తాలను ఫ్రిడ్జ్ లో అసలు
పెట్టరాదు. పదార్థాలు చెడిపోయే తరుణంలో బాక్టీరియా వృద్ధి చెంది ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు.
*
ఫ్రిడ్జ్ లో పెట్టిన పదార్తాలకు మూతలు తప్పక పెట్టాలి పదార్థాలుంచిన పాత్రలమూతలు తీసివేయరాదు.. అనేక పదార్థాల వాసనలు కలిసిపోయి విషవాయువులు
తయారవుతాయట.
*
మెటాలిక్ పాత్రలు వాడ కూడదు లేకపోతే రసాయనిక చర్య మూలంగా పదార్థాల రుచిమారవచ్చు. ప్లాస్టిక్ పాత్రలు వాడటం మేలు.
*
ఫ్రిజ్ లో ఉంచిన పదార్థాలను ఎప్పటిలోగా తిరిగి
ఉపయోగించు కోవాలన్నది తెలుసు కోవాలి. ఫ్రిజ్లోనేకదా అని పదార్థాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకండి. ఫ్రిజ్లో పెట్టినంత మాత్రాన అవి చాలా రోజులు పాడవకుండాఉంటాయనుకోవడం భ్రమ మాత్రమే.కరెంట్ పోయిన సందర్భాలు ఉంటాయి. జాగ్రత్త
*
గాజు , ప్లాస్టిక్ పాత్రలలో పదార్థాలు , ద్రవాలకు
పైమూతలు ఉంచి నిల్వ చేస్తే మంచిదేమో.
*
ఫ్రిజ్ లో ఉంచిన పదార్థాలను బయటకు తీసి వేడి చేసి వాడినచో మరలా అదే పదార్థాన్ని ఫ్రిజ్ లో దాచి మరో సారి వాడాలనే తలంపు మంచిదికాదు.
*
ఫ్రిజ్లో చిందిన పదార్థాలు, గడ్డ కట్టిన ఐస్ వంటి
వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఇలా చేస్తే లోపల
ఉన్న పదార్థాలు విషపూరితం కాకుండా జాగ్రత్త
పడవచ్చు
*
వేడి పదార్థాలను చల్లారిన తర్వాతే ఫ్రిజ్లో పెట్టాలి. అతివేడివి పెడితే లోపల ఉష్ణోగ్రత పెరిగి సూక్ష్మజీవులూ పెరుగుతాయి.
*
తలుపును ఎక్కువ సేపు తెరిచి ఉంచితే ఫ్రిజర్
లోపల ఉష్ణోగ్రత పెరిగి సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి
*
ఒకసారి డీప్ ఫ్రీజర్లోంచి తీసిన పదార్థాలను తిరిగి ఫ్రీజర్లో ఉంచొద్దు. ఒకసారి బయట పెట్టిన ఆహారంపై బ్యాక్టీరియా పెరగడం ప్రారంభం అవుతుంది.
దాన్ని మళ్లీ లోపల పెడితే ఆ బ్యాక్టీరియా ఎక్కువవు
తుంది. అందువల్ల అవసరమైనంత వరకు
తీసుకుని మిగిలింది లోపలే ఉంచాలి.
*
నీటి పరిమాణం ఎక్కువగా ఉండే పుచ్చకాయ వంటి
వాటిని సిల్వర్ ఫాయిల్లో ఉంచాలి. లేకపోతే నీరు అంతాపోయి,
ఎండిపోవడమేకాక పోషక విలువలు కూడా మాయం
అవుతాయి
*
ఫ్రీజ్లో సామర్థ్యానికి మించి ఎక్కువ వస్తువులు
పెట్టకూడదు.
*
పికెల్స్, క్రీమ్స్ వంటి వాటి ఎక్స్ పైరీ డేట్ చూసుకొని
పనికిరాని పారవేయడం వంటివి అప్పుడప్పుడూ
చేస్తూ ఉండాలి.
క్రమం తప్పకుండా శుబ్రం చేయడం మరువ
కూడదు
*
ఫ్రిడ్జ్ లో నిలువ ఉంచిన పదార్తాలు చిన్న పిల్లలకు
పెట్టడం వీలైనంత తగ్గించాలి
*
రేడియట్ హీట్ కి సంబందించిన వాటిని( ఉదా:స్టవ్, వాటర్
హీటర్)ఫ్రిజ్ కి దూరంగా ఉంచాలి
*
ఫ్రిజ్ యొక్క ఇంజన్ కూడా విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించి, రేడియేషన్ కు కారణం అయ్యే అవకాశం ఉంది . దీని వల్ల ఫ్రిజ్ లో పదార్థాలు విషతుల్యాలుగా మారతాయి. ఎంత తీవ్రత అన్నదానిపై హాని ఆధారపడి ఉంటుంది. తయారీదారు అన్ని రకాల
జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు సెల్ టవర్ నుంచి 20 వాట్స్ పవర్ (సిగ్నల్ స్ట్రెంగ్త్ ) మించి ఉండ కూడదు. ప్రైవేట్ ఆపరేటర్లు ఈ నిబంధన
పాటించరు. లాభాలే వారి పరమావధి.జీవులు ఆరోగ్యం , ప్రాణాలు వారికి లెఖ్ఖలో ఉండదు. ఫ్రిడ్జ్ కొనేటపుడు విద్యుదయస్కాంతతరంగాలు రేడియేషన్ ప్రభావం వంటి విషయాలలలో తాయారు దారులు జాగ్రత్తలు
తీసుకున్నారో లేదో చర్చింఛి కొనాలి
*
ఫ్రిడ్జ్ వెనకాల ఎవాపరేట్ బాక్స్ లోని నీరు తీసేటపుడు . తప్పని సరిగా కరెంట్ చెక్ చేయాలి లేదంటే కొన్ని సందర్భాలలో షాక్ కి గురయ్యె ప్రమాదం ఉంది..!!

Previous
Next Post »