హార్టు 80 నుండి 100 సార్లు కొట్టుకుంటూంటే



సాధారణంగా పెద్ద వారి గుండె నిమిషానికి 60 నుండి 100 సార్లు కొట్టుకుంటుంది. అయితే, అసలు సాధారణం అంటే ఏమిటనేది రీసెర్చర్లు పరిశీలిస్తున్నారు. విశ్రాంతి సమయంలో కనుక హార్టు 80 నుండి 100 సార్లు కొట్టుకుంటూంటే,కొంచెంపాటి ఆందోళన చెందాల్సిందేనంటారు వీరు.

జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్ లో సైంటిస్టులు 50,000 మంది ఆరోగ్యకరమైన స్త్రీలను, పురుషులను రెండు దశాబ్దాలపాటు పరిశీలించారు. వీరు జరిపిన పరిశోధనలలో సుమారుగా 4,000 మంది గుండె జబ్బుతోనే మరణించినట్లు తెలుపబడింది. గుండె కొట్టుకోడం 10 బీట్లు అధికమైతే చాలు గుండె జబ్బుతో చనిపోయే రిస్కు మహిళలకు 18 శాతం, పురుషులకు 10 శాతం గాను వుందని వీరు తెలిపారు.

నిమిషానికి 80 సార్లు కంటే అధికంగా గుండె కొట్టుకునే వారు లావు పెరిగిపోతారని, లేదా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశముందని ది అమెరికన్ జర్నల్ ఆఫ్ హైపర్ టెన్షన్ లో ప్రచురించారు. కనుక హార్టు బీటింగ్ రేటును తగ్గించుకోవాలంటే హార్టు కు సంబంధించిన ఎక్సర్సైజులు చేయడం గుండె ప్రతి బీటింగ్తోను అధికమైన రక్తాన్ని పంప్ చేసుకునేలా చేయటమే నంటున్నారు రీసెర్చి చేసినవారు

Disclaimer :: This Post Purely Educational Purpose Only
Previous
Next Post »