మానసిక ఒత్తిడికి మందులున్నాయా, ఉంటే ఏని?




ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రజలే ఎక్కువ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్ధ తాజాగా వెల్లడించింది. మన దేశంలో మిగిలిన ప్రాంతాల కంటే దక్షిణాది రాష్ట్రాల ప్రజలు అధికంగా ఒత్తిడికి గురవుతున్నారనేది గతంలో జరిపిన అధ్యయనాల్లో తేలిన అంశం. ఒత్తిడే కదా అని వదిలేస్తే అది పలు అనర్ధాలకు దారి తీస్తుంది. తీవ్ర డిప్రెషన్ స్ధితికి తీసుకు వెళుతుంది. అందుకే మానసిక ఒత్తిడి తీవ్ర రూపం ధరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. అవేమిటో పరిశీలిద్దాం.

ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. మొలకలెత్తిన గింజలు, బాదం, జీడిపప్పు, గుడ్లు, ఫ్యాట్ తక్కువగా ఉన్న చీజ్ వంటి పదార్ధాలు డిప్రెషన్ ను అదుపులో ఉంచుతాయి. పచ్చికూరలు, ఆకు కూరలు డిప్రెషన్ ను దూరంగా ఉంచే దివ్యౌషధం. రోజూ ఒక గ్లాస్ కేరెట్ జ్యూస్ తీసుకోవడం వలన ఒత్తిడి ఉండదు.

ఇకపోతే మనం తీసుకొనే ఆహారంలో ఒమేగా 3 అధికంగా ఉండే పదార్ధాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీటన్నిటికి మించి నిత్యం వ్యాయామం చేయడం వల్ల డిప్రెషన్ ను ఆమడ దూరంలో ఆంచే అవకాశం ఉంటుంది. సానుకూల భావనలు కలిగించే ఎండోర్ఫిన్ లు చైతన్యవంతం అయ్యేందుకు క్రమం తప్పని వ్యాయామం ఎంతగానో తోడ్పడుతుంది. అంతే కాకుండా, సూర్యరశ్మి శరీరానికి తగిలేలా జాగ్రత్త తీసుకుంటే తగినంత విటమిన్ ఢి శరీరానికి అందుతుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఈ సూచనలు పాటించి మన జీవితాల్ని మింగేసే మనోవ్యధను దూరం చేసుకోవచ్చు. అసలు మీరు మనో వ్యాధితో బాధపడుతున్నారో లేదో తెలుసుకొనేందుకు క్రింది ప్రశ్నలు వేసుకోండి. వీటిలో కనీసం మూడు ప్రశ్నలకు అవుననే సమాధానం వచ్చిందంటే మీరు ఎంతో కొంత మనోవ్యధతో ఉన్నట్లే.

1. మీరు ఎక్కువ సేపు నిద్రపోతున్నారా ? ఎప్పుడూ బద్ధకంగా ఉంటోందా ? మేలుకున్న కాసేపూ నిరాసక్తంగా అనిపిస్తోందా ?

2. ఆకలి తగ్గిందా ? బరువు తగ్గిపోతున్నారా ? లేక తింటే అతిగా తింటున్నారా ?

3. దైనందిన కార్యక్రమాల పట్ల ఏ మాత్రం ఆసక్తి లేకుండా పోతోందా ?

4. తరచు చిరాకు, క్షణాల్లో మూడ్ మారుతున్నదా ?

5. శక్తినంతా ఎవరో గుంజేసినట్లు అయిపోతున్నారా ?

6. తరచు అపరాధ భావంతో బాధ పడుతున్నారా ?

వీటిలో మూడు ప్రశ్నలకు అవును అనే సమాధానం కనుక వస్తే మీరు ఎంతో కొంత మనోవ్యధతో బాధపడుతున్నట్లే. ఈ స్ధితిలో పైన చెప్పిన సూచనలను పాటించడంతో పాటు మనస్తత్వ నిపుణులను సంప్రదిస్తే సత్వర ఫలితం ఉంటుంది.

Disclaimer :: This Post Purely Educational Purpose
Previous
Next Post »