అమెరికాలో కరెంటు పోతే వాళ్ళు కరెంటాఫీస్‌కు ఫోన్ చేస్తారు.
జపాన్‌లో కరెంటు పోతే వాళ్ళు మొదట ఫ్యీజు చెక్ చేస్తారు.
అదే మన దేశంలో కరెంటు పోతే పక్కింట్లో చెక్ చేస్తాం.
ఓహో అందిరింట్లో పోయిందా.. ఐతే ఒకే...
Disclaimer:: This post intention was not to humiliate any individual just for fun
1 Comments:
Write Commentsఏమనుకోకండి జోక్ అనే ఈ కథ ఆన్లైన్లో తిరుగుతుంటుంది కానీ దీంట్లో కొత్తగా చెబుతున్నది ఏమీ లేదండి. నిజానికి అమెరికా లోనూ, జపాన్ లోనూ ఏం చేస్తారని అంటున్నారో మనదేశం లోనూ సరిగ్గా అదే చేస్తాం.
Replyమా రోజుల్లో సెల్ఫోన్లు లేవు. ల్యాండ్ లైన్లు కూడా చాలా తక్కువ మంది ఇళ్ళల్లో ఉండేవి. కరక్టే మొదట చూసేది అందరికీ పోయిందా అనే చూస్తాం ... ఎందుకంటే అందరికీ వచ్చినప్పుడు మనకీ వస్తుందనీ, ప్రత్యేకంగా మనింటి గురించి కంప్లైంట్ ఇచ్చినా కరెంటాఫీస్ వాళ్ళు అదే సమాధానం చెబుతారనీ తెలుసు కాబట్టి. ఇప్పటికీ ఇదే పద్ధతి.
ఒకవేళ మన ఇంట్లో మాత్రమే పోయింది అని కనబడుతుంటే ... మేమూ ఫ్యూజ్ పోయిందా అనే మొదట చెక్ చేసేవాళ్ళం. ఇంట్లో తీగ ముక్క ఉంటే, చాతనయితే ఫ్యూజ్ వేసుకునేవాళ్ళం. లేకపోతే కరెంట్ ఆఫీస్ (Fuse-Off Call Office అనేవారు) దాకా సైకిల్ మీదో నడుచుకుంటూనో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళం (ఫోన్లు తక్కువ కాబట్టి). రాత్రి పూట అయితే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, మర్నాడు పగటిపూట ఏదో ఒక టైముకి వచ్చి సరిచేసేవాళ్ళు.
జడివాన మొదలయితేనో, బలంగా ఈదురుగాలులు వీస్తుంటేనో కరెంటాఫీస్ వాళ్ళే సప్లై ఆపేసేవాళ్ళు “ముందస్తు” జాగ్రత్తగా ... లైవ్ వైర్లు (కరెంట్ ప్రవహిస్తున్న తీగలు) తెగి రోడ్డు మీదో ఇళ్ళ మీదో పడితే ప్రమాదాలు ప్రాణనష్టం జరుగుతాయి గనక 🙂. ఈ పద్ధతి మాత్రం ఇప్పటికీ మారలేదు లెండి ... అండర గ్రౌండ్ వైర్లు ఇంకా చాలా చోట్ల వెయ్యలేదు కాబట్టి.
EmoticonEmoticon