మిడిమిడి ఙ్ఞానం చాలా ప్రమాదకరం. ఏదైనా విషయం గురించి లోతైనా అధ్యయనం సాగిస్తే గాని అందులోని సత్యాన్ని గ్రహించలేము. అలాగే బృందావనంలో జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు గోపికలతో సాగించిన రాసలీలల వెనుక కూడా ఓ మహత్తర కార్యం దాగి ఉంది. ఇది తెలియక విమర్శకులు నోటికొచ్చనట్టు మాట్లాడుతారు. అంతే కాదు సనాతన ధర్మాన్ని పాటించకుండా అష్ట భార్యలు, పదహారువేల గోపికల పట్ల శ్రీకృష్ణుడు ఆమానుషంగా వ్యవహరించాడని విమర్శిస్తుంటారు. బహు భార్యత్వాన్ని కలిగి, తన మేనత్త రాధతో సహజీవనం చేసిన ద్రోహిగా అభివర్ణిస్తారు. ఇలాంటి వారి పిచ్చి ప్రేలాపలు అన్నీ అసంబద్ధమైనవి.
ఆ భగవానుడి గొప్పదనం గురించి శ్రమద్భాగవత పురాణంలోని పదో స్కాందంలో వివరించారు. ముఖ్యంగా బృందావనంలో గోపికలతో కృష్ణుడు సాగించిన శృంగార జీవితాన్ని గురించి విశదపరిచారు. తన పదేళ్ల వయసులో ప్రతి గోపికతో శ్రీ కృష్ణుడు చేసిన నృత్యాలు, సహ అలవాట్లను గురించి వేద వ్యాసుడు ఐదు అధ్యాయాల్లో రాసలీలలు పేరుతో వివరించారు. అయితే చివరి అధ్యాయంలో మాత్రం వాటి వెనుకున్న తత్వాన్ని బోధించాడు.
భాగవతంలో పదో స్కాందంలో వేద వ్యాసుడు పేర్కొన్న మహా రాసలీలలపై సూత మహర్షి వివరణ ఇచ్చారు. విశ్వానికంతటికీ దేవుడైన శ్రీ కృష్ణుడు అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పరిరక్షించాడు కదా, మరి ఇతరుల భార్యల పట్ల ఎందుకు అధర్మంగా వ్యవహరించాడని సూత మహర్షిని పరీక్షిత్ చక్రవర్తి ప్రశ్నించాడు. అలాగే
స్వీయ నియంత్రణ కలిగిన ఆ దేవదేవుడికి ఇంద్రియాల ద్వారా సంతృప్తి అవసరం లేదు, అయినా అక్రమ లైంగిక సంబంధాలనే పాపాత్మకమైన పనికి ప్రేరణ ఏంటి? అని అన్నాడు.
అప్పుడు చిన్నగా నవ్విన సూత మహర్షి ఉదాహరణగా 30 నుంచి 40 మంది దేవుళ్ల వృత్తాలను వివరించాడు. వాళ్లు కొన్ని సందర్భాల్లో అనైతికమైన పాపకార్యాలకు పాల్పడ్డారు. కానీ శక్తివంతమైన వీళ్లు జీవుల యొక్క ప్రయోజనాలకు భంగం కలిగినప్పుడు మాత్రమే ఇలా చేయడానికి ప్రయత్నించారు. పాల సముద్ర మథించినప్పుడు భయంకర విషం హలాహలం ఉద్భవించింది. దాన్ని ఎవరు తాకడానికి ప్రయత్నించకపోయిన మహాదేవుడి తన గరళంలో నిలుపుకున్నాడు. అదే గనుక వ్యాపిస్తే సమస్థ జీవరాశి నాశనం అయ్యేది.
ఈ దేవతలకు అహంకారం ఉండదు. జీవరాశుల ప్రయోజనాలు కాపాడటం కోసం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా కార్యాలను నిర్వహించడమే వీరి విధి. ఇలాంటి సందర్భాల్లో కొన్ని తప్పులు, అనైతిక చర్యలు చోటు చేసుకుంటాయి తప్ప దీని వెనుక మరే దురుద్దేశం ఉండదని సూతుడు తెలియజేశాడు. తెలివైనవాడు భగవంతుడు చేసే ఇలాంటి చర్యలను ప్రశ్నించడు. ఎందుకంటే దీని వెనుక పరమార్థం ఉందని తెలుసుకుంటాడు.
గోపికల తమ భర్తల శరీరంలో అణువణువునా మమేకమై ఉన్నారు. వీళ్లు భౌతికంగా తమ భర్తలతోనే ఉన్నా మానసికంగా మాత్రం బృందావనంలో శ్రీకృష్ణుడితో నృత్యం చేస్తూ, సహజీవనం చేసిన విషయం వారి భర్తలకు తెలియదు. ఎందుకంటే తమ భార్యలు భౌతికంగానే వారితో ఉన్నారు కాబట్టి. భగవంతునిలో ఐక్యమైన ఆ గోపికలు తిరిగి ఇంటికి వెళ్లడానికి నిరాకరిస్తే శ్రీకృష్ణుడి వారిని వారించడంతో ఎప్పటిలాగే సాధారణ నిత్యకృత్యాలను చేసుకున్నారు.
ఇందులో ఎలాంటి అనైతికంగానీ, నీచమైన పని లేదు. జగన్నాటక సూత్రధారితో పసిపిల్లల నుంచి పండు ముదసలి వరకు అందరూ నృత్యం చేస్తూ తన్మయత్వం పొందారు. కేవలం వారు మానసికంగా ఆరాధించారు తప్ప భౌతికంగా దగ్గర కాలేదని వేద వ్యాసుడు విశదీకరించాడు. ఇందులో జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయడమనే అంశం దాగి ఉందని తెలిపాడు.
2 Comments
Write Comments
Reply"అప్పుడు చిన్నగా నవ్విన " నవ్వు ఇప్పటి దాకా కతను లాగిస్తోందన్నమాట.
కాలక్షేపం బాగుంది.
జిలేబి
:) :)
ReplyEmoticonEmoticon