రోజ్‌ కొబ్బరి లడ్డూ




కావలసినవి : 

ఎండుకొబ్బరి పొడి- 2 కప్పులు, 
కండెన్స్‌డ్‌మిల్క్‌- అరకప్పు, 
రోజ్‌సిరప్‌- టీస్పూను, 
యాలకుల పొడి- అరటీస్పూను, 
నెయ్యి- 3 టీస్పూన్లు

తయారుచేసే విధానం : 

పాన్‌లో నెయ్యి వేసి, వేడిగా అయ్యాక కొబ్బరిపొడి, కండెన్స్‌డ్‌మిల్క్‌, రోజ్‌ సిరప్‌, యాలకుల పొడి వేసి కలుపుతూ చిన్న మంట మీద ఉడికించాలి.  మిశ్రమం మొత్తం ఉడికి, ముద్దగా అయ్యాక దించి చల్లారనివ్వాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే చిన్న చిన్న లడ్డూల్లా చేసుకుని, కొబ్బరిపొడిలో దొర్లించి ఆరనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఫ్రిజ్‌లో పెడితే త్వరగా గట్టిపడతాయి. లేదా గాలికి పూర్తిగా ఆరాక, డబ్బాలో పెట్టి నిల్వ చేయాలి.

Previous
Next Post »