క‌ద‌లాడే ఉద్యాన‌వ‌నాలు




అప్పుడెప్పుడో వేలాడే ఉద్యానవనాలు బాబిలోనియాలో ఉండేవని విన్నాం. అదో ప్రపంచ వింతనీ చెప్పుకున్నాం. కానీ, ఈ కదలాడే ఉద్యానవనాలేందబ్బా అనుకుంటున్నారా..? ఇవి జపాన్‌లోని ట్రాలీ ఆటోల్లో పెంచే చిరు తోటలు..! స్థలాభావం ఎక్కువగా ఉండే నగరజీవులకు ఇవే పచ్చని పలకరింపులు. తమకంటూ ఓ గార్డెన్‌ ఉండాలని జపాన్‌ యువతకు ఓ పెద్ద కోరికట. కానీ, తాముండే చోటుల్లో ఆ తోటమాలి కల కష్టం. అందుకే, అక్కడ ల్యాండ్‌స్కేప్‌ పరిశ్రమ ఊపందుకుంది. కొన్ని మోడళ్లను తమ ట్రాలీ ఆటోల మీదే పెంచి ప్రచారానికి తిప్పుతుంటారు. అంత జాగాలోనూ ఎంతో అద్భుతమైన తోటను రూపొందించొచ్చని ఇలా చెబుతారన్న మాట. అప్పుడప్పుడు పోటీలు, ఉత్సవాలు పెట్టుకుని ఇలా తమ ల్యాండ్‌స్కేపింగ్‌ కళను ప్రదర్శిస్తుంటారు. మీరు చెప్పండి ఏ మొబైల్‌ ల్యాండ్‌స్కేప్‌ నచ్చిందో..!

Previous
Next Post »