శరీరము పై ఉండే చర్మము మనల్ని ఉష్ణము , చలి , దుమ్ముల నుంచి కాపాడుతుంది . .. కాని చలి కాలము లో చర్మము పొడి బారడం తో దానిపై పగుళ్ళు వస్తాయి ... మరీ పలుచని చర్మము పోరలుందే పెదాలు , బుగ్గలు పై పగుళ్ళు ఎక్కువగా ఉంటాయి .
చరం లోరెండు పొరలుంటాయి.. పై పోరా లో ఉండే కణాలలో జీవముండదు , అది దేహానికి ధృడముగా ఉండే ఒక కవచం లా పనిచేస్తుంది , ఈ పోరా కింద ఉండే పొరలో ప్రత్యేకమైన తైల గ్రంధులు ఉంటాయి . ఈ గ్రందు లు ఒకరకమైన నునే పదార్ధాన్ని స్రవిస్తూ ఉంటాయి . ఈ పదార్ధము అక్కడే ఉండే సన్నని వెంతుకల మూలల నుంచి , వెంట్రుకల ద్వారా చర్మము పై భాగానికి వచ్చి శరీరం పై పరుచుకుని ఉంటుంది . చర్మం లోపల పొరలో ఈ తైల గ్రంధులతో పాటు స్వేద గ్రందులు కుడా ఉంటాయి ... వీటిలో ఉత్పన్నమైన స్వేదము (చెమట) చర్మం లో ఉండే అతి సూక్ష్మమైన రంద్రాల ద్వారా చర్మము పై భాగానికి చేరుకుంటుంది .
ఈ విదంగా చర్మము ఉపరితలము పై చెమట , నూనెల మిశ్రమము తో కూడిన మనం లాంటి పదార్ధము సన్నని ఫిలిం లాగా కప్పబడి ఉంటుంది . . . ఈ ఫిల్ము మన చర్మాన్ని నున్నగా , మెత్తగా , సున్నితం గా ఉంచుతుంది . అలాగే చర్మములోని నీరు అతిగా చుట్టూ ఉండే వాతావరణము లోకి పోయి చర్మము ఏందీ పోకుండా అడ్డుకుంటుంది . చలికాలములో గాలి చల్లగాను , పొడిగాను ఉంటుంది అందువల్ల చమట అంతగా పట్టదు ... గాలి పొడిగా ఉండడము తో శరీరముపై ఉండే కొద్దిపాటి చెమట , నునే లాంటిపదార్ధము అతి త్వరగా ఆవిరైపోయి శరీరము పై ఉండే ఫిలిం లాంటి పోరా ఎండిపోయి పలుచన పడిపోయిన కారణము గా 'భాష్ఫీభవన క్రియ (evaporation)" చర్మము లో ఉన్నా నీటిని కోల్పోయి ఎండిపోయి పగుళ్ళు వస్తాయి. శీతాకాలము లో వేజలిన్ గాని నునే గా చర్మానికి రాసుకుంటే ఈ భాద ఉండదు .
EmoticonEmoticon