పాములు పై చర్మాన్ని ఆరు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి వదిలేస్తాయి . పాముల చర్మము నీటిని బయటకు పోనివ్వని పొలుసులను కలిగి ఉంటుంది . పొలుసుల తో కూడిన చర్మము పెరుగదు ... లోపలవున్న శరీరము పెరుగుతుంది . . . కాబట్టి పై చర్మము బిగుతుగా తయారవుతుంది . ఆ బిగుతైన చర్మము వదిలించుకోవడమే ... కుబుసం వదలడం అవుతుంది . కొత్తచరమము తయారయ్యకే పాతచర్మము కుబుసం రూపాన వదలివేయును .
పాములే కాదు , తొండ ,మొసలి , ఉడుము వంటి అనేక సరీసృపాల (reptiles) వర్గానికి చెందినా జంతువులు , బొద్దింక , తేలు వంటి కీటక(orthropoda) జాతి జంతువులు , యెన్ద్రకాయలు , కుబుసము(moulting)విడుస్తాయి . పొలుసుల చేతను , తట్టి పలకల్లాంటి భాగాలచేతను నిర్మితమైన చర్మము గల జంతువులు తమ ఎదుగుదల కు అనుగుణముగా పాత చర్మాన్ని విసర్గించుకుంటాయి .. అదే సమయము లో కొత్త పొలుసులు , అదనపు పొలుసులు , అదనపు పలకలు , కొత్త పలకల తో కూడిన నూతన చర్మాన్ని సృష్టించు కొంటాయి .
అభివృద్ది చెందినా స్కీరదాలు (mammals) కు చర్మము పొలుసుల తో కాకుండా మెత్తటి కణజాలము (tissue)తో నిర్మితమై ఉంటుంది ,. పైగా చాలా పొరలుగా ఉంటుంది . ఎపితీలియం , ఎక్షొదెర్మ్ , ఏందో డెరం అనే పొరల్లో ఎపితీలియం పైభాగాన ఉంటుంది . దీని కింద ఉన్నా దేర్మిస్ పొరలు పలుచటి కండర కణజాలము తో చక్కటి రబ్బరు పొరలాగా శరీరాన్ని కప్పి ఉంచుతుంది . పై భాగాన ఉన్న ఎపితేలియం కణాలూ కుడా పాతవి నశించి కొత్తవి పుడుతుంటాయి . అయితే ఇవి కలసికట్టుగా నశించి పోవడము వలన మనిషి తదితర అగ్రస్థాయి జంతువులు కుబుసము విదిసినట్టు అనిపించదు .
EmoticonEmoticon