టాజిల్ టై బ్యాక్స్...







టాజిల్ టై బ్యాక్స్ అంటే కర్టెన్లను ఒక పక్కకు పట్టి ఉంచే పట్టుతాళ్లు. ఇంటి అలంకరణలో అట్రాక్ట్‌గా ఉండి అందాన్నిస్తాయి. సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉండే ఈ టాజిల్ టై బ్యాక్స్‌తో ఇంటి అలంకరణకు రాయల్ లుక్ వస్తుంది. కిటికీ కర్టెన్లకు, గదుల మధ్య ద్వారాలకు వేసిన కర్టెన్లకు, విశాలమైన హాలులో డైనింగ్ ప్లేస్‌ని వేరు చేస్తూ వేసిన కర్టెన్లకు, వేటికైనా సరే టై బ్యాక్స్ కొత్త లుక్‌ని ఇస్తాయి.

ఈ టైబ్యాక్స్‌కి పట్టుకుచ్చుల్లాంటి టాజిల్స్ ఉంటే ఆ అందం మరింతగా ఇనుమడిస్తుంది. కర్టెన్‌ని ఒక పక్కగా పట్టి ఉంచడమే వీటి పని. దీంతో బయటి వెలుతురు గదిలోకి రావడానికి వీలుంటుంది. పెద్ద హాల్‌ని పూర్తిగా కర్టెన్ వేసి విడదీయడం నచ్చకున్నా.. మరీ హాలు పెద్దగా కన్పించడం కూడా నచ్చకపోతే, కర్టెన్ వేసి దాన్ని టైబ్యాక్స్‌తో పక్కకి కట్టేయండి.



ఇలా చేస్తే ఇంకాస్త డిఫరెంట్‌గా మరో లుక్ వస్తుంది. ఇక డెకరేటివ్ టై బ్యాక్స్ చాలా రకాలు లభిస్తున్నాయి. కాటన్, సిల్క్ రకరకాల మెటీరియల్‌తో తయారైన బీడెడ్, సీక్వెన్‌డ్ టాజిల్స్‌తో ఉన్నవి కూడా అందుబాటులోనే ఉన్నాయి. గది అలంకరణ, సైజు, కర్టెన్ల రంగు, డిజైన్ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని టైబ్యాక్స్ ఎంచుకోవాలి. వీటిల్లోనూ మల్లీ ప్యాటర్న్స్, సైజులు కూడా ఉంటాయి తెలుసుకుని కొనాలి. 

Previous
Next Post »