గొంతునొప్పికి మిరియాల వైద్యం ఉపకరిస్తుంది. మిరియాలని, ఉల్లిపాయల్ని కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నయం అవుతాయి. నేతితో మిరియాలని వేయించుకుని పొడి చేసుకుని తింటే గొంతు బాధలు తగ్గుతాయి. తీవ్రమైన జలుబుకు, దగ్గుకు మిరియాల పొడి చారుకి మించిన గొప్ప వైద్యం లేదు.
మిరియాలు, వెల్లుల్లిని నీటిలో వేసి బాగా ఉడికించుకుని ఆ నీటిలో తేనె కలుపుకుని, అప్పుడప్పుడూ తాగుతుంటే శరీరంలోని వేడి తగ్గుతుంది.
అజీర్ణవ్యాధితో బాధపడేవారికి కూడా ఇవి మేలుచేస్తాయి. మూత్ర సంబంధ వ్యాధులు గలవారికి మిరియాలు మంచి ఔషధం.
తినే పదార్థాలపై మిరియాల పొడిని చల్లుకుని తినడం వలన రుచితో పాటు ఆరోగ్యమూ కలుగుతుంది. మతిభ్రమ, మూర్ఛ, హిస్టీరియా లాంటి వ్యాధులు ఉన్నవారు మిరియాల ఘాటును పీల్చితే మంచిది.
మిరియాల పొడి, ఉప్పు పొడి సమంగా కలిపి, ఆ పొడిని కొండనాలుకకు బాగా అద్దుకుంటే కొండనాలుక తగ్గి, విపరీతంగా వచ్చే దగ్గు నివారణమవుతుంది.
EmoticonEmoticon