కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు రెండు మూడు పనులకు ఉపయోగపడే వస్తువులు మేకప్ కిట్‌లో ఉండేలా చూసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం..
లిప్స్టిక్:
బ్లష్‌గా కూడా ఉపయోగించేందుకు వీలుండే లిపిస్టిక్స్‌ని తీసుకెళ్లాలి. కళ్లు పెద్దవిగా కనిపించేందుకు కనుపాపలు, కళ్ల చుట్టూరా చక్కగా దిద్దుకోవాలి.
హైబ్రో పెన్సిల్:
చివరలో బ్రష్ ఉన్న వాటర్ ప్రూఫ్ కనుబొమ్మల పెన్సిల్‌ను ఎంచుకోవాలి. దీన్ని కనుబొమ్మలను సరిదిద్దడానికి, కాటుక అద్దుకోడానికి కూడా వాడొచ్చు.
పెట్రోలియం జెల్లీ:
ఇది కనుబొమ్మలకు జెల్‌గాను, చాప్‌స్టిక్‌గానూ ఉపయోగపడుతుంది.
కాటుక:
దీన్ని లిక్విడ్ లైనర్‌గా కూడా వాడొచ్చు. బ్రష్ ఉన్న కళ్ల లైనర్‌ను తీసుకుంటే మంచిది.
రోజ్ వాటర్:
మేకప్ వేసుకొనే ముందు రోజ్ వాటర్‌ను టోనర్‌గా ఉపయోగించండి. మేకప్ తీసేసేందుకు కూడా ఈ వాటర్‌ను వాడొచ్చు.
EmoticonEmoticon