చిన్నపాటి కూరగాయల మొక్కలను ఏ విధంగా పెంచాలి



వంటకు కిచెన్ మూలమైతే, కూరలకు ఉల్లిపాయలు ప్రధానం. వాటిని కోసేవాళ్లు ఏడ్చినా, కూరకు కమ్మటి రుచిని ఇచ్చేవి మాత్రం ఉల్లిపాయలే. అలాంటి ఉల్లిపాయల పెంపకం గురించి చాలా మందికి తెలీదు. మొక్కల ప్రేమికులు ఎలాంటి మొక్కలైననా పెంచాలనుకుంటారు. అయితే అలాంటి వారు ఉల్లిపాయలతో పాటు వంటింటికి సంబంధించిన చిన్నపాటి కూరగాయల మొక్కలను ఏ విధంగా పెంచాలో చూద్దాం.

పల్లెటూరులో అయితే ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటుంది. అదే పట్టణాల్లో అయితే ఇరుకైన ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు లేక ఇబ్బందులు పడుతుంటారు. ఉన్న కొద్ది స్థలంలోనే నచ్చిన మొక్కలను పెంచుతారు. రసాయనిక ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలోనే కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలు పెంచుతుంటారు.




ఇంటి ఆవరణలో టమాట, వంకాయ, సొరకాయ, కాకరకాయ, బీరకాయ, నిమ్మ వంటివి సులభంగా సాగుచేసుకోవచ్చు. పుదీనా, కరివేపాకు, పాలకూర, తోటకూర, ఉల్లి దాదాపు పూలకుండీల్లో పెంచుకునేవే. ఇలాంటి చిన్నపాటి మొక్కల పెంపకంలో ఇబ్బందులు ఉండవు. ఇంటి అవరణలో పండిన తాజా కూరగాయలతో పౌష్టికాహారం అందుతుంది.

గార్డెనింగ్ హాబీగానే కాకుండా, ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా దూరం చేస్తుంది. బయటనుండి తెచ్చుకునే కూరగాయలకు ఎక్కువ మోతాదులో రసాయనాల వినియోగం ఆరోగ్యంపై తీవ్ర  ప్రభావం చూపుతుంది. వీటన్నింటకీ చెక్ పెట్టాలంటే కిచెన్ గార్డెన్‌ని ఎంచుకోవడమే బెస్ట్ ఆప్షన్. కొన్ని రకాల కూరగాయల మొక్కలను ఎలా పెంచుకోవాలో తెలుసు కానీ, ఉల్లిపాయల పెంపకం చాలా మందికి తెలియదు. మరి మన కిచెన్ గార్డెన్‌లో ఉల్లిపాయను ఏ విధంగా సాగుచేయాలో తెలుసుకందాం... 


ఉల్లిపాయల రకాలు..

ఎలాంటి ఉల్లిపాయలు కావాలో వాటినే ఎంపిక చేసుకోవాలి. ఉల్లిపాయల్లో రెడ్, వైట్, ఎల్లో ఆనియన్స్ ఉంటాయి. వీటిలో ఎలాంటివి మంచిగా పెరుగుతాయి. లేదా రుచిని ఇచ్చే వాటిని ఎంపిక చేసుకోవాలి. 

గ్రీన్ ఆనియన్స్ పెంపకం..

గ్రీన్ ఆనియన్స్‌ను పాట్స్ లేదా బాటిల్లో  పెంచుకోవచ్చు. సౌకర్యాన్ని, స్థలాన్ని బట్టి వీటిని పెంచుకోవచ్చు. పాట్‌లో పెంచడానికి ఎరువు అవసరం. బాటిల్‌ల్లో అయితే నీటిలోనే  వీటి ఎదుగుదల బాగుంటుంది. వీటి ఆధారంగా వీలును బట్టి గ్రీన్ ఆనియన్స్‌ను పెంచుకోవచ్చు. 

ఎరువు తయారీ..

కంపోస్ట్ చేర్చిన ఎరువును తయారు చేసుకోవడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి. ఎరువును కుంపటిలో నింపి నీటిని పోస్తే మొక్కలకు హైడ్రేషన్ బాగా అందుతుంది. కుంపటిలో పెంచే మొక్కలకు నీరు చాలా అవసరం అవుతుంది. కుంపటిని ఎంపిక చేసుకుంటే పెద్ద సైజ్‌లో ఉండే విధంగా చూసుకోవాలి. లేదంటే మొక్కలు సరిగా పెరగవు.

ప్లాంట్ సెట్స్..

ఉల్లిపాయ వేర్లు లోతుగా ఉండేట్లు చూసుకోవాలి. ఆనియన్స్ నిండుగా చక్కగా ఉండేలా మొక్కను నాటాలి. అలాగే మొక్కలు నాటడంలో ఒక దానికొకటి 11/2 నుండి 2 ఇంచుల దూరంలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే  బాగా పెరుగుతాయి. పాట్స్‌కు ఎండ తగిలేలా  అమర్చాలి. 
Previous
Next Post »