1) ఒక పనిని 12 మంది మనషులు 20 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 15 మంది మనుషులు ఎన్ని రోజుల్లో పూర్తిచేయగలరు.
1) 12 2) 14 3) 16 4) 20
2) A ఒక పనిని 10 రోజుల్లో పూర్తిచేయగలడు. B అదే పనిని 12 రోజుల్లో పూర్తిచేయగలడు. ఇద్దరూ కలసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తిచేయగలరు.
1) 5 రోజులు 2) 10 రోజులు
3) 5 (5)/11 రోజులు 4) 6 రోజులు
3) 10 మంది మనుషులు 20 బొమ్మలను రోజుకు 12 గంటల చొప్పున 12 రోజుల్లో తయారు చేస్తే అవే బొమ్మలను 24 మంది మనుషులు 32 బొమ్మలను రోజుకు 16 గంటల చొప్పున ఎన్ని రోజుల్లో తయారుచేస్తారు.
1) 2 రోజులు 2) 3 రోజులు
3) 6 రోజులు 4) 8 రోజులు
4) A మరియు B ఒక పనిని 3 రోజుల్లో పూర్తిచేస్తారు. B మరియు C అదే పనిని 9 రోజుల్లో పూర్తిచేస్తారు. అదే పనిని C మరియు A లు కలసి 12 రోజులో చేస్తే, ముగ్గురూ కలసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తిచేయగలరు.
1) 3 15/19 రోజులు 2) 4 15/19 రోజులు
3) 4 1/2 రోజులు 4) 5 రోజులు
5) 6 మంది పురుషులు లేదా 8 మంది స్త్రీలు ఒక పనిని 86 రోజులలో పూర్తిచేయగలరు. అదే పనిని 14 మంది పురుషులు లేదా 10 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో పూర్తిచేయగలరు.
1) 12 రోజులు 2) 14 రోజులు
3) 15 రోజులు 4) 24 రోజులు
6) 5 మంది పురుషులు ఒక పనిని 2 రోజుల్లో మరియు ముగ్గురు బాలురు అదే పనిని 5 రోజుల్లో పూర్తిచేస్తే, 10 మంది పురుషులు మరియు ముగ్గురు బాలురు కలసి ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తిచేయగలరు.
1) 5 రోజులు 2) 5/6 రోజులు
3) 4 రోజులు 4) 6 రోజులు
7) రెండు సంఖ్యల నిష్పత్తి 3:5. ఆ సంఖ్యలలో ప్రతి సంఖ్య నుండి 9ని తీసివేసిన ఆ సంఖ్యల నిష్పత్తి 12:23. అయిన ఆ సంఖ్యలలో పెద్ద సంఖ్య ఎంత
1) 44 2) 33 3) 66 4) 55
8) ఒక సంచిలో రూ.10, రూ.5, మరియు రూ.2, నోట్లు 2:3:5 నిష్పత్తిలో కలవు. ఆ సంచిలో మొత్తం 2025 రూ.లు వుండిన రూ.10 నోట్ల సంఖ్య ఎంత.
1) 60 2) 80 3) 75 4) 90
9) P:Q:R=2:3:4 అయిన P/Q : Q/R :R/P విలువ ఎంత
1) 8:9:24 2) 9:8:24 3) 24:8:9 4) 8:24:9
10) (a+b) : (a 5:3 అయిన (a2+b2):(a2 విలువ ఎంత
1) 17:15 2) 25:9 3) 4:1 4) 16:1
11) 4, 16 మరియు 7ల చతుర్థ అనుపాతం ఎంత
1) 28 2) 29 3) 22 4) 25
12) ఒక వ్యక్తి 30% ఓట్లను పొంది తన ప్రత్యర్థి చేతిలో 500 ఓట్లతో ఓడిపోయాడు. అయితే మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత
1) 1100 2) 1200 3) 1250 4) 1500
13) ఒక పట్టణ జనాభా 352800. ఆ పట్టణ జనాభా సం.నకు 5% చొప్పున పెరిగితే రెండు సంవత్సరాల క్రితం ఆ పట్టణ జనాభా ఎంత
1) 320000
2) 340000
3) 360000
4) 380000
14) ఒక టేబుల్ ను 1500 రూ.లకు కొని 6% నష్టానికి అమ్మితే టేబుల్‌ని అమ్మిన వెల ఎంత
1) 1400 2) 1410 3) 1420 4) 1450
15) ఒక వ్యాపారి 1 రూ.కి 10 చాక్లెట్లను అమ్మితే 40% లాభం వచ్చును. అయితే అతడు ఆ చాక్లెట్లను 1 రూ.కి ఎన్ని కొన్నాడు
1) 12 2) 14 3) 16 4) 20
16) ఒక గడియారాన్ని 1440 రూ.కి అమ్మడం వలన 10% నష్టం వచ్చును.అదే గడియారo ఫై 10% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి (రూ.లలో)
1) 1760 2) 1800 3) 1600 4) 1850
17) విజయ్ 10 కలములను 11 రూ.కి కొని, 11 కలములను 10 రూ.కి అమ్మితే అతనికి వచ్చే లాభ / నష్ట శాతమెంత
1) 17 43/121 % 2) 18% 3) 17% 4)12%
18) ఒక వస్తువును రూ.2220కి అమ్మడం వల్ల 20% లాభమొస్తే అతడు ఆ వస్తువుని ఎంతకి కొన్నాడు
1) 1750 2) 1876 3) 1776 4) 1850
19) ఒక వస్తువును అమ్మిన వెలలో 2/3 వ వంతు కొన్న వెల అయితే ఆ వస్తువుపై వచ్చే లాభ/నష్ట శాతం ఎంత
1) 20% 2) 50% 3) 40% 4) 60%
20) 3 పంపులు రోజుకు 8 గంటల చొప్పున పనిచేసి ఒక ట్యాంక్‌ని 2 రోజుల్లో ఖాళీ చేయగలవు. నాలుగు పంపులు రోజుకు ఎన్ని గంటలు పనిచేసి ఒకరోజులో ఆ ట్యాంక్ ని ఖాళీ చేయగలవు
1) 9 2) 10 3) 11 4) 12
21) ఒక వ్యక్తి ప్రస్తుత వయస్సు అతని తల్లి వయస్సులో 2/5 వ వంతు.8 సంవత్సరాల తరువాత అతని వయస్సు అతని తల్లి వయస్సులో సగం అవుతుంది. ప్రస్తుతం అతని తల్లి వయస్సు ఎంత
1) 48 2) 40 3) 32 4) 36
22) 15 సంవత్సరాల తరువాత ఒక వ్యక్తి వయస్సు, 15 సం.రాల క్రితపు అతని వయస్సుకు 4 రెట్లు వుంటే అతని ప్రస్తుత వయస్సు ఎంత
1) 35 2) 30 3) 20 4) 25
23) రెండు చతురస్రముల చుట్టుకొలతలు 40 సెం.మీ. మరియు 32 సెం.మీ.. ఈ రెండు చతురస్రాల వైశాల్యముల బేధంనకు సమాన వైశాల్యము గల మూడవ చతురస్త్రం యొక్క చుట్టుకొలత ఎంత (సెం.లలో)
1) 24 2) 30 3) 16 4) 18
24) ఒక పాచికను దొర్లిస్తే 3 యొక్క గుణిజం రావడానికి సంభావ్యత ఎంత
1) 1/2 2) 1/3 3) 1/4 4) 1
25) రెండు పాచికలను ఒకేసారి దొర్లిస్తే వచ్చే సమన అంకెల జతల సంభావ్యత ఎంత
1) 1/(6) 2) 1/3 3) 1 4) 1/2
26) ఒక వృత్తం యొక్క వ్యాసం 12.5% పెరిగితే, ఆ వృత్త చుట్టుకొలతలో ఎంత శాతం పెరుగును.
1) 12.5% 2) 25% 3) 6.25% 4) 50%
27) 5 సెం.లు వ్యాసార్థం గల ఒక వృత్తంలో చతురస్రం వుంటే ఆ చతురస్ర వైశాల్యం ఎంత
1) 30 చ.సెం.లు 2) 40 చ.సెం.లు
3) 50 చ.సెం.లు 4) 60 చ.సెం.లు
(Hint: వృత్త వ్యాసము= చతురస్ర కర్ణం; చతురస్ర వైశాల్యం=1/2 x (కర్ణం)2)
28) ఒక దీర్ఘచతురస్రాకారపు స్థలం యొక్క ఒక భుజం 15 మీ. మరియు ఒక కర్ణం 17 మీ. అయితే ఆ స్థలం యొక్క వైశాల్యం కనుగొనుము
1) 100 చ.మీ. 2) 140 చ.మీ.
3) 120 చ.మీ. 4) 150 చ.మీ.
(Hint: వెడల్పు= కర్ణం2 వెడల్పు= 8 మీ.)
29) 6,8,4,7 మరియు 9లను ఉపయోగించి ఎన్ని 5 అంకెల సంఖ్యలను ఏర్పరవచ్చు
1) 60 2) 120 3) 240 4) 150
(Hint: 5!; 5 అంకెల సంఖ్యలు = 5 x 4 x 3 x 2 x 1 = 120)
సమాధానాలు: (1) 3, (2) 3, (3) 3, (4) 1, (5) 4, (6) 2, (7) 4, (8) 4, (9) 1, (10) 1, (11) 1, (12) 3, (13) 1, (14) 2, (15) 2, (16) 1, (17) 1, (18) 4, (19) 2, (20) 4, (21) 2, (22) 4, (23) 1, (24) 2, (25) 1, (26) 1, (27) 3, (28) 3, (29) 2.
EmoticonEmoticon