బిడ్డ ఎదుగుదలకు తల్లిపాలు శ్రేష్టం








తల్లిపాలు - శ్రేష్టమైనవి. ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతంది. శిశువు జన్మించాక  మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. దీని వలన బిడ్డకు జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఉండవు.

జీర్ణకోశ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. చాలా తేలికగా అరుగుదల అవుతుంది. బిడ్డకు మలబద్దకం సమస్య ఉండదు. తల్లిపాల వలన ఆస్తమా, చెవికి సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది. తల్లి పాల వలన-స్ధూలకాయం ఉండదని శాస్త్రవేత్తల  పరిశోధన వలన తెలుస్తుంది. 


తల్లి పాలు- బాల్యం దశలో లుకేమియా వ్యాధి రాకుండా పెద్దవయస్సులో అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి  రాకుండా కాపాడుతుంది. తల్లిపాలు- పిల్లల తెలివి తేటలను పెంచుతంది. తల్లి పాలలో చాలా ఫాటీ ఆసిడ్స్ ఉన్నందున పిల్లలలో మెదడు పెరుగుదలకు ఉపయోగపడుతంది.

  తల్లి బిడ్డల మధ్య బాంధవ్యం పెరుగుతుంది. తల్లి ఒడిలో బిడ్డ ఉన్నందున బిడ్డ  చాలా అనుకూలమైన స్ధితిలో ఉంటుంది. అవసరమైన బరువుతో పెరగగలుగు తుంది. తల్లి పాలు పిల్లకు తొందరగా జీర్ణమవుతాయి. తల్లిపాలల్లో ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్, కాల్షియం, పొటాషి యం తదితరాలు అవసరమైన మేరకు ఉంటాయి. ఫలితంగా బిడ్డ ఆరోగ్యంగా పెరుగగలుగుతుంది.  వైరస్ ఇన్ఫెక్షన్స్, అలర్జీ రాకుండా ఉంటాయి.

తల్లికి లాభాలు

తలి ్లపాలు ఇచ్చినందు వల్ల  తల్లికి ప్రసవానంతర సమయంలో బరువు తగ్గుటకు దోహదపడుతుంది. మానసిక వత్తిడిని తగ్గించి బాలింత దశలో రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. తల్లికి రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ లాంటివి రాకుండా  కాపాడుతుంది.

ఎంత ఎక్కువ కాలం తల్లి బిడ్డకు పాలు ఇస్తే అంత మంచిది. వ్యాధుల నుండి అంతే ఎక్కువ కాపాడుతుంది. ఆవు లేక గేదె పాలు తీసుకున్న పిల్లలు ఎక్కువ అలర్జీ సమస్యలకు గురి అవుతారు. రొమ్ము వాపు నొప్పిని తగ్గిస్తుంది.

ఎప్పుటి నుండి తల్లి పాలు మొదలు పెట్టాలి

ప్రసవం అయిన వెంటనే ఎంత తొందరగా మొదలు పెడితే అంతమంచిది. ప్రసవం అయిన వెంటనే శిశువును శుభ్ర పరిచిన వెంటనే తల్లి చర్మం తగులునట్లు, తల్లి రొమ్ములకు దగ్గరలో బిడ్డను ఉంచినచో బిడ్డ శరీర ఉష్ణోగ్రత పెంచుతుంది. తల్లి పాలు వచ్చుటకు ప్రేరేపణ జరుగుతుంది.

తల్లి బిడ్డల మద్య ప్రేమ పెరుగుతుంది. తల్లులు ఆపరేషన్ ద్వారా కానుపు అయినాకాని, తల్లి పాలు ప్రసవించిన  4 గంటల తరువాత ఇవ్వవచ్చు. తల్లిని ఒక ప్రక్కకు త్రిప్పి పాలు పట్టించవచ్చు.



ఎందుకు వెంటనే తల్లి పాలు ఇవ్వాలి? దానికి గల కారణాలు?

శిశువు పుట్టిన మొదటి 30 నుండి 60 నిమిషాలు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ సమయంలో పాలు చీకటానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది. తల్లి నుంచి మొదటిసారి వచ్చే పాలలో  కోలాస్ట్రం  ఉంటుంది. ఇది త్రాగించటం వలన శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శిశువు వ్యాధుల బారిన పడకుండా ఇది ఒక టానిక్ లా పనిచేస్తుంది.

ఎంతకాలం వరకు ఇవ్వవచ్చు?

మొదట 6నెలలు ప్రత్యేకం.ఆ తరువాత రెండు సంవత్సరాల వరకు ఆపైన కూడా ఇవ్వవచ్చు.

తల్లిపాలే శ్రేయస్కరం

శిశువుకు తల్లి పాలను మించిన ఆహారం లేదు. ప్రోటీన్లు, విటమిన్లతో కూడిన తల్లిపాలను తాగించినప్పుడే బిడ్డ ఆరోగ్యంగా పెరగగలుగుతుంది. కానీ కొందరు తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్‌పై ఉన్న కొన్ని అపోహలతో పిల్లలకు పాలివ్వరు. దీంతో అటు శిశువు, ఇటు తల్లి కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని శిశువు పుట్టిన కొంత సేపటి నుంచే తల్లి పాలివ్వడం అన్ని విధాలా శ్రేయస్కరం.

తల్లి పాలే ఆరోగ్యం

శిశువుకు జన్మనిచ్చిన కొంతసేపటి నుంచే తల్లి తన బిడ్డకు పాలివ్వడం ప్రారంభించడం శ్రేయస్క రం.సాధారణ కాన్పు జరిగిన వారు ఒకటి, రెండు గంటల్లోపే సిజేరియన్ జరిగిన వారికి నొప్పి తగ్గిన 4, 5 గంటల్లోపే బిడ్డకు పాలివ్వవచ్చు. దీంతో బిడ్డ ఆరోగ్యంగా, దీంతో పిల్లలకు విరోచనాలు సక్రమంగా జరగడమే కాకుండా ఎటువంటి ఆరోగ్య సమస్య లు ఎదురుకావు.

తల్లి పాలు తాగే శిశువుకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు రావు. కొందరు తల్లులకు సరిగ్గా పాలురావు. అటు వంటి వారు వచ్చినంత మేరకు తల్లి పాలిచ్చిన అనంతరం తక్కువ పడితే బాటిల్తో పాలు పట్ట వచ్చు.ఇక తల్లి అస్సలు పాలివ్వకపోతే శిశువుకు మోకాళ్లు వంకరతిరగడం వంటి సమస్యలు ఎదు రుకావచ్చు.



శిశువు తల్లిపాలు తీసుకోవ డంతో ఈ పాలల్లో ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ ఉంటాయి. దీం తో శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. బిడ్డ ఆకలితో ఏడ్చిన వెంటనే సులభంగా తల్లి తన పాలివ్వవచ్చు. అదే డబ్బా పాలివ్వడానికి సమయం పడుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంటే స్త్రీలకు వెంటనే ప్రెగ్నెన్నీ రాకుండా ఉంటుంది. పాలివ్వడం మూలంగా తల్లిలో యూటెరస్ తిరిగి మామూలు సైజుకు చేరుకుంటుంది.

మానసికంగా సిద్ధం చేయాలి

మొదటి కాన్పు జరిగే గర్భిణులకు బిడ్డకు పాలిచ్చే విషయంలో ముందుగానే మానసికంగా సిద్ధం చేయాలి. 7, 8 నెలల గర్భంతో ఉన్నప్పుడే వారికి పుట్టిన వెంటనే శిశువుకు పాలివ్వాలని చెప్పాలి. దీనివల్ల ఉన్న అపోహలను తొలగిం చేందుకు ప్రయత్నించాలి.

బిడ్డకు పాలిచ్చే బ్రెస్ట్ నిపుల్‌ను కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. నిపుల్ వెనక్కి ఉంటే పుట్టిన బిడ్డ పాలు తాగేందుకు ఇబ్బందులు ఎదురవు తాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని సరి చేయాలి. పాలిచ్చేటప్పుడు నిపుల్ చుట్టూ శుభ్ర పర్చుకోవాలని తల్లులకు చెప్పాలి.

ఆరు నెలల వరకు తప్పనిసరిగా..

తల్లి శిశువుకు ఆరు నెలల వరకు తప్పనిసరిగా పాలివ్వాలి. శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తొమ్మిది నెలలవరకు పాలివ్వడం శ్రేయస్కరం. ఇక అయిదు నెలల నుంచి పాలతో పాటు పండ్లు, పిల్లలకు ఇచ్చే ఇతర పోషకాహారాన్ని అందజేయ డం మంచిది. ఇక బిడ్డకు ప్రతి రెండు, మూడు గంటలకొకసారి తప్పనిసరిగా తల్లి పాలివ్వాలి.

ఒక వేళ శిశువు గాఢ నిద్రలోఉంటే నాలుగు గంటలకైనా పాలివ్వాలన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. తల్లి బిడ్డకు కనీసం అయిదు నిమిషాలైన పాలివ్వాలి. తల్లి పాలిచ్చినా ఇంకా ఏడుస్తుంటే బిడ్డకు పాలు సరిపోలేదన్న విషయాన్ని గమనించి బాటిల్‌తో పాలు తాగించాలి.

సిజేరియన్ ఆపరేషన్ జరిగినవారు  ప్రారంభంలో పడుకొని పాలిచ్చిన నొప్పి తగ్గిన తర్వాత కూర్చొని పాలివ్వాలి. కూర్చొని పిల్లలకు పాలిస్తేనే మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీంతో శిశువు కడుపు నిండా పాలు తాగగలుగుతాడు. పాలు తాగిన తర్వాత బిడ్డను భుజంపై వేసుకొని కొద్దిగా జో కొడితే పాలతోపాటు వెళ్లే గాలి మూలంగా వాంతులు రాకుండా ఉంటాయి. ఈ విధంగా చేస్తే శిశువుకు పాలు వెంటనే జీర్ణం అవుతాయి.

పాలు సక్రమంగా రాకపోతే..

వయస్సు పెరిగిన తర్వాత డెలివరీ అయ్యే స్త్రీలల్లో పాలు రావడం తగ్గుతుంది. ముఖ్యంగా 35 సంవత్సరాల తర్వాత కాన్పు జరిగే వారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తగిన వయస్సులో గర్భం ధరించడం శ్రేయస్కరం. పిల్లలకు పాలివ్వడంలో ఎటువంటి టెన్షన్ పడకూ డదు. ప్రశాంతంగా పాలిస్తేనే తల్లి బిడ్డకు సక్రమంగా పాలివ్వగల్గుతుంది.

కొందరు స్త్రీలలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో సరిగ్గా పాలు రావు. బిపి, గుండె సమస్యలు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళల్లో ఈ సమస్య ఉంటుంది. పాలు సక్రమంగా రాని బాలింతలకు కాల్షియం, ఇతర మందులను అందజేస్తా రు.



ఇలాంటి వారు ఎక్కువ క్యాలరీల తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్లు, విటమిన్లతో కూడిన ఆహారంతోపాటు పాలు, బ్రెడ్, రొట్టెలు తీసుకోవాలి. తల్లికి తగినంత నిద్ర ఉండాలి. నీళ్లు బాగా తాగాలి. ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు తల్లి బిడ్డకు సక్రమంగా పాలివ్వగల్గుతుంది.

బ్రెస్ట్ ఇన్ఫెక్షన్, గడ్డలు ఉన్నప్పుడు తల్లి బిడ్డకు సరిగా పాలివ్వలేదు. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడే వెంటనే  వైద్యునితో చికిత్స చేయించు కో వాలి. బిడ్డకు జలుబు ఉన్నప్పుడు ముక్కు పట్టేసి పాలు తాగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. జలుబు ఉన్న పిల్లలకు వెంటనే వైద్యం చేయించాలి.

తల్లిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే పాల ద్వారా అది బిడ్డకు సోకే ప్రమాదముంది. తీవ్రమైన గుండె వ్యాధితో బాధపడుతున్న తల్లులు బిడ్డకు పాలివ్వలేరు.

ఇక డెలివరీ సమయంలో షాక్‌తో సైకోగా మారిన వారు సైతం తమ పిల్లలకు సక్రమంగా పాలివ్వలేరు. ఇటు వంటి వారు కూడా వెంటనే వైద్యం చేయించుకోవాలి.
Previous
Next Post »