సాధారణంగా అబ్బాయిలు తమ మనసులోని భావాలను ప్రియురాలికి వ్యక్తపరచడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. ప్రియురాలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లడం, ప్రతి రోజూ ఆమెను వెంబడించడం, ప్రేమ లేఖలు రాయడం, తనకు నచ్చిన గిఫ్ట్‌లు, - గులాబీలు ఇవ్వడం, లవ్ గ్రీటింగ్స్ ఇవ్వడం ఇలా రకరకాల మార్గాలను ఉపయోగిస్తుంటారు. కానీ నేరుగా చెప్పడానికి కొంత భయానికి లోనవుతుంటారు. మరి అలా భయపడకుండా ధైర్యంగానే మనసులోని మాటలను ఇష్టపడుతున్న వారికి ఎలా చెప్పాలో చూసేయండి.
కొంత మంది అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయిలకు తమలోని ప్రేమ భావనలు వ్యక్తపరచడానికి ఎవ్వరూ అనుసరించని ప్రత్యేక పద్ధతులను పాటించడానికి ప్రయత్నిస్తారు. మరి కొంతమంది సినీ హీరోల్లాగా డైలాగ్స్ చెప్పి ప్రపోజ్ చేయడం చేస్తుంటారు. మరి కొంతమంది ఎవ్వరూ చేయని పిచ్చి పిచ్చి పద్ధతులతో విసుగు తెప్పిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఉపయోగమేమీ ఉండదు. నిజమైన ప్రేమను వ్యక్తపరచేందుకు మీకు మీరుగానే ప్రయత్నించాలి. కానీ వేరే వాళ్ల స్టుల్‌ను అనుసరించొద్దు.
సమయం వృధా..
చాలా మంది అబ్బాయిలు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ ఎలా చేయాలి. అన్న ఆలోచనలోనే కాలాన్ని వృధా చేస్తుంటారు. ఇలా చేస్తే ఏ ప్రయోజనం దక్కదు. మీకు నచ్చిన అమ్మాయి మిమ్మల్ని ప్రేమించాలంటే.. మీరు ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయికి కూడా తెలిసేలా చేయాలి.
అప్పుడే ఏదైనా ఒక రిజల్ట్ బయటపడుతుంది. అలా అని నేరుగా వెళ్లి “ఐ లవ్ యూ” అని కూడా చెప్పకూడదు. తను కూడా మీమీద చొరవ చూపిస్తేనే మీ మాటలను చెప్పేందుకు వీలుంటుంది.
ప్రపోజ్ చేసే ముందు..
నచ్చిన అమ్మాయికి మనసులోని మాటలను చెప్పేముందు తన మనసులో కూడా ఎవరైన వున్నారా? లేదా? అనే విషయాన్ని తెలుసుకుంటే బాధపడే అవసరం ఉండదు. ఒకవేళ ఉంటే ముందుగానే డ్రాప్ అవ్వొచ్చు. లేదంటే ప్రపోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంతే గానీ తొందరపడి చెప్పేయకండి.
నేరుగా చెప్పేయొద్దు..
అమ్మాయి నచ్చింది కదా అని నేరుగా వెళ్లి ఐ లవ్ యూ చెప్పకూడదు. అలా చేస్తే అమ్మాయి మిమ్మల్ని పిచ్చివాడిలా ట్రీట్ చేసి, చెంప ఛెళ్లుమని పగలగొట్టొచ్చు. ఎదుటి వాళ్ల మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ మీ మాటలతో అమ్మాయిలను ఇబ్బంది పడకూడదు.
ఇష్టాలేంటో తెలుసుకోవాలి..
ప్రేమించాక అమ్మాయికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవాలి. ఇష్టాలేంటో అడిగి మరీ తెలుసుకొని, తీర్చాలి. దానికి తగ్గట్టుగానే అమ్మాయిలకు కొన్ని సందర్భాలలో వారి ఇష్టాలను నెరవేరిస్తే హ్యాప్పీగా ఫీల్ అవుతారు. నమ్మకం కూడా ఏర్పడుతుంది.
సమస్యలెదురైతే..
తను ఏదైనా ఒక సమస్యలో వుండి, బాధపడుతుంటే తోడుగా నిలిచి, ధైర్యం చెప్పాలి. వీలైతే సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. లేదా సమస్య తగ్గేందుకు సలహాలైనా ఇవ్వాలి. బాగున్నప్పటి కంటే ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆదుకున్నవారి మీద ప్రేమ, గౌరవం ఎక్కువగా ఏర్పడుతాయి. మీరు సమస్యల్లో కూరుకున్నప్పుడు తను కూడా సహకరిస్తుంది.
ప్రేమ మొదలయ్యాక ఇలా...
నచ్చే ప్రతి చిన్న విషయాన్ని ప్రియురాలితో పంచుకుంటే తను కూడా హ్యాప్పీగా ఫీల్ అవుతుంది. మీ ఆలోచనలకు తగ్గట్టుగానే నడుచుకోడానికి సిద్దపడుతుంది. ప్రేమలో దాపరికాలు ఉండకూడదు. కాబట్టి ప్రతి విషయాన్ని స్వేచ్ఛగా చెప్పుకుంటే మీ ఆలోచనలను అర్థం చేసుకుంటుంది. వృధా ఖర్చులు మాని, ఓవర్ యాక్షన్ చేయకుండా నువ్వు నువ్వుగా సహజంగా ఉంటే నిజాయితీ గుర్తిస్తుంది.
దాంతో ఆ అమ్మాయి మనసులో మీపై ప్రేమను పెంచుకోవచ్చు. అమ్మాయి మీపట్ల ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తూ, మీకు నచ్చినట్లుగా నడుచుకుంటే తను కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లే. ప్రియురాలు తన మనసులో వున్న భావాలను నేరుగా కాకుండా మీనుంచే చెప్పించడానికి ప్రయత్నిస్తుంది. అలాంటి సమయాల్లో మీరు ప్రపోజ్ చేస్తే చాలు. తను మీ ప్రేమను అంగీకరించేందుకు ఎదురుచూస్తుంటుంది.
EmoticonEmoticon