పాత కొత్త కలయికలతో ఫ్యాషన్ ప్రపంచంలో రోజుకో వెరైటీ పుట్టుకొస్తోంది. కేవలం మనదేశ సంప్రదాయాలే కాకుండా వివిధ దేశాల ఫ్యాషన్‌ను కూడా అనుకరిస్తున్నారు. అందులో భాగంగానే టర్కీ స్టుల్‌ని ఫ్యాషన్‌గా అనుసరిస్తున్నారు. డ్రెస్ స్టైలిష్‌గా ఉంటూనే, సౌకర్యంగా ఉంటాయి. ఈ రెండు కఫ్తాన్ సొంతం. అందుకే యంగ్‌ఏజ్ వాళ్లే కాదు అమ్మలు కూడా కఫ్తాన్ని ఇష్టపడి ధరిస్తున్నారు.
క్యాజువల్ వేర్ నుంచి కలర్‌ఫుల్ పార్టీ వరకు కఫ్తాన్ రాణిస్తుంది. పొడవు కఫ్తాన్ని కుట్టేస్తే పగలే కాదు రాత్రి పూట ధరించడానికి వీలుగా నైట్ వేర్ అవుతుంది. అంటే మ్యాక్సీ కఫ్తాన్ అన్నమాట. టర్కీలో కొన్నేళ్ల క్రితమే మొదలైన ఈ స్టైల్ ఇప్పుడు మన దగ్గర కొత్తగా రూపుకట్టింది. అతివలకు సౌకర్యవంతమైన డ్రెస్‌గా పేరొందింది. అందంలో అన్నింటా తానే ముందుంటా నంటోంది కఫ్తాన్!
EmoticonEmoticon