నెట్ లేకుండానే మ్యాప్స్

మీరు సరదాగా ఫ్యామిలీతో వెళ్లొచ్చిన ట్రిప్ తాలూకా జ్ఞాపకాలను పదిలంగా దాచుకునేందుకు చక్కని యాప్స్ అందుబాటులొకొచ్చాయి. ఆఫ్ లైన్ మ్యాప్స్   గమ్యాన్ని చేర్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మ్యాప్స్ తో ఇప్పటివరకూ  ఎక్కడికి వెళ్లాలి, ఏరూట్ నుండి వెళ్లాలి, ఎంత సమయం పడుతుంది అని  ఎక్కడికైనా సులభంగా వెళ్లేంత టెక్నాలజీ  అందుబాటులో ఉంది. కాకపోతే చాలా రకాల యాప్స్ కు మొబైల్ డేటా అవసరం. అయితే తీరా టూర్స్‌కి వెళ్లినప్పుడు డేటా లేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే   ‘మ్యాప్స్ డాట్ మి’ యాప్‌కు మాత్రం ఆఫ్ లైన్ లోనూ చక్కగా పని చేస్తుంది. 




లైవ్ ట్రాకర్


ఈ యాప్ మీ పర్యటన వివరాలన్నింటినీ రికార్డ్ చేస్తుంది. మీరు వెళ్లొచ్చిన మార్గం, ఎక్కడ ఫొటోలు తీశారు, మీరు బస చేసిన ప్లేస్ వీడియోలను ఎక్కడ షూట్ చేశారనే విషయాన్ని ఇది ట్రాక్ చేస్తుంది. అంతేకాకుండా మీ పర్యటనకు సంబంధించిన సమగ్ర సమాచారంతో ఓ బ్లాగ్ ను కూడా క్రియేట్ చేస్తుంది. ఈ యాప్‌తో మన జ్ఞానపకాలను పదిలంగా ఉంచుకోవచ్చు, మరొకరితో టూర్ విశేషాలను షేర్ చేసుకోవచ్చు.
Previous
Next Post »