ఆడపిల్లకు చిన్న తనం నుంచి తండ్రే రియల్ హీరో, నడిచే వయసులో వేలుపెట్టి నడిపించినా, గుండెలపై ఆడించినా, అది తండ్రి మాత్రమే. ఒక స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా, సంరక్షకుడిగా, అన్ని విధాలా నేనున్నానంటూ అండగా ఉండే విధంగా తండ్రి ఈ అంశాలను గుర్తుపెట్టుకుని నడచుకోవాలి. ఆమె జీవితంలో బాల్యం, కౌమార యవ్వన దశలలో మీ పాపాయిపై మీ శ్రద్ధ తప్పక అవసరం. అందుకే కౌమార దశలో ఆమెను మీకు దూరంగా ఉంచకూడదు.
ఎఫెక్షన్
పాప జన్మించిన రోజు నుండే, తనపై ఆసక్తి చూపడమనేది సరైన విషయం. శిశువుగా ఉన్నప్పటినుంచి ఆమె కదలికలను శ్రద్ధగా గమనించండి. మీ పాపకు మీరొక స్నేహితుడిగా మారండి. తన కోసం కాస్త సమయాన్ని కేటాయించండి. ఆమె పెరిగే క్రమంలో అలవాట్లు అభిరుచులు, స్నేహితుల గురించి తెలుసుకొండి. ఆమె పట్ల మీరు స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తున్నారనే విశ్వాసాన్ని కల్పించండి.
ఆమె అభిరుచిని గౌరవించండి
అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడుతారు వారు సాధారణంగా అబ్బాయిల కంటే ఎక్కువ మాట్లాడుతారు. ఆమె మాటలను, కళలను, ఆశయాలను వినండి, మీ కుమార్తె మీతో తన రహస్యాలను కూడా పంచుకో వచ్చు, అవి మంచివైన లేదా చెడువైనా అయి ఉండవచ్చు. క్లిష్ట పరిస్థితులు ఎదుర్కుంటున్న సమయాల్లో దూషించడం లేదా చివాట్లు పెట్టడం కంటే, వారిలో లోపాలను సరి చేయండి. వారి ఆలోచనలను, అభిరుచులను గౌరవిస్తునట్లు తనకు అర్ధమయ్యేలా చెప్పండి.
ప్రోత్సాహంతో పాటు విశ్వాసాన్ని అందించండి
ఒక ‘వ్యక్తి’ చేసే పనులను అనగా ఇంట్లోని చిన్న చిన్న మరమ్మత్తులు, వాటితో పాటు రోజువారీ కార్యకలాపాలైన కొత్త పుస్తకాలు చదవడం, డ్రైవింగ్ వంటి పనులను తనకు నేర్పించండి. కేవలం ఆమెతో మీరు ఉండి వాటిని విజయవంతంగా పూర్తి చేసేందుకు వారిని ప్రోత్సహించండి. సంభాషించుకోవడం సమస్యలను పంచుకోవడం: ఒక అమ్మాయి తన తల్లితో కలిసి ఎలా అయితే తన అభిప్రాయాలను పంచుకుంటుందో, అదే విధంగా ఆమె అన్ని రకాల విషయాల గురించి మీతో కూడా అంతే బాహాటంగా మాట్లాడేంతగా విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి.
కపటం లేకుండా, నిజాయితీగా - మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకొండి, అన్ని రకాల అనుభూతులను వారికి తెలియజేయండి - ప్రేమ, ఆలోచనలు, అభినందనలు, నిరుత్సాహాలు వంటి అన్ని విషయాలను ఆమెకు మద్దతు ఇచ్చే తరహాలో తెలియజేయండి. ఈ విధంగా చేయడం వలన ఆమె మీ అభిప్రాయాలను గౌరవించడానికి ఆస్కారముంటుంది. బాహ్య సౌందర్యం కంటే అందమైన మనస్సు అంతరంగిక అందం గొప్పదని, ఆమెకు తెలియజేయండి. ఆమెపై మీకు గల విశ్వాసాన్ని ఆమెకు తెలియచేయండి. ఆమె తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా లేదా ఆమె మీతో పంచుకున్న రహస్యాల ద్వారా అయిన అయి ఉండవచ్చు.
తన నిర్ణయాలను అంగీకరించండి
తను తీసుకున్న నిర్ణయాలు న్యాయబద్ధమైనవైనా, కాకపోయిన తన నిర్ణయాలు మీరు అంగీకరించినా లేకపోయినా, సమస్యను విశ్లేషించి ఆ పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొండి. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, పొరపాట్లు చేసినందుకు మీ కుమార్తెకు చివాట్లు పెట్టకండి. దానికి బదులుగా, తన నిర్ణయాల పట్ల బాధ్యత వహిస్తూ ఆమె తన తప్పిదాలను తెలుసుకునే విధంగా వివరించండి, ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించండి.
EmoticonEmoticon