అందరికీ భావోద్వేగాలు వుండటం సహజం. అవి సందర్భాలను బట్టి ఒక్కొక్కటి ఒక్కో విధంగా బయటకు వస్తూ వుంటాయి. సంతోషపు భావోద్వేగాలు ఆరోగ్యానికి చాలావరకు మంచి చేస్తాయి కాబట్టి వాటి గురించి చర్చించుకోవాల్సిన అవసరం అంతగా లేదు. కానీ కోపం లాంటి భావోద్వేగం ఆరోగ్యానికి హానికరం. మనుషులు మానిసకంగా కృంగిపోతున్న సమయంలోనే కోపం ఎక్కువగా వస్తుంది. అలా కాకకుండా ప్రతిచిన్న విషయాలకు కోపాద్రిక్తులైతే మాత్రం ఆరోగ్యానికి హానికరమైన సంకేతాలుగా చెప్పుకోవచ్చు.
కోపాన్ని చాలావరకు వదిలేస్తేనే మంచి, లోపలే అణుచుకుంటే మాత్రం ఆరోగ్యానికి విషపూరితంగా మారిపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కోపం ఏదోఒకరకంగా హానికరమైన సంకేతంగానే నిలుస్తుంది. అటువంటి సమయాల్లో కోపాన్నే అదుపులో వుంచుకుంటే చాలా మంచిది. మరి ఈ కోపాన్ని అదుపులో వుంచే హెల్తీ మార్గాలేంటో ఒకసారి తెలుసుకుందాం...
ఒత్తిడితో వచ్చే ఆవేశం..
సహజంగా కోపం అనేది కొన్ని కారణాల వల్ల వస్తుంది కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. ఇంట్లో వున్నవారితో వాగ్వాదానికి దిగడం లాంటి ఇతర కారణాల వుండొచ్చు. అలాంటి సమయాల్లో కోపం వస్తుందనిపిస్తే, వాటికి కూడా దూరం పాటిస్తేనే మంచిది.
కోపం వచ్చే సమయంఓ వెంటనే బయటకువెళ్లి, కోపాన్ని వదిలేసి ప్రశాంతంగా ఊపరి పీల్చుకోవాలి. ఎందుకంటే శరీరంలో ఎక్కువ ఆక్సిజన్ చేరి కోపాన్ని చాలావరకు తగ్గించి, మెదడులో వుండే ఒత్తిడి(స్ట్రెస్)ను తగ్గించి శాంతపరుస్తుంది.
కోపాన్ని కూడా వ్యక్తపరచాలి..
కొంతమంది భావోద్వేగాలను వ్యక్తపరచకుండా తమ మనసులోనే దాచుకుంటారు. ఎవరైనా ఎప్పుడూ అసంతృప్తికి గురిచేస్తుంటే వారికి స్ట్రెయిట్‌గా సమాధానం చెప్పడానికి భయపడుతుంటారు. అలాగే మనసులో వున్న కోరికలను, బాధను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. అలాకాకుండా..
మనసులో వున్న భావోద్వేగాలను ఎప్పటికప్పుడు ఇతరులతో, బంధువులతో, స్నేహితులతో పంచుకుంటేనే మంచిది. అలాగే ఎవరైనా సహనాన్ని పరీక్షించి, అసహనానికి గురిచేసే వారికి స్ట్రెయిట్‌గా సమాధానం చెప్పేయాలి. అలా చేయకపోతే మానసిక ఒత్తిడికి లోనయి, ఎక్కువ కోపానికి గురవుతారు.
కోపం వస్తే, బయటికి వచ్చేసెయ్యాలి..
ఇంట్లో తల్లిదండ్రులతో లేదా భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు వివాదాలు చోటు చేసుకోవడం సహజమే. ఆ సమయంలో ఎక్కువ కోపానికి గురవ్వకుండా, మనసులో వున్న అన్ని భావేద్వేగాలను చంపుకోవాలి. ప్రతి దానికి కోపం తెచ్చుకుంటే అధిక స్ట్రెస్‌కు లోనయి అనారోగ్య పరిస్థితికి గురయ్యే అవకాశం ఉంటుంది.
అలాంటి కోపాద్రిక్తులైన పరిస్థితుల్లో వెంటనే బయటకు వచ్చేసి స్నేహితులతో కలిసిపోయి ప్రశాంతమైన వాతావరణానికి చేరుకుంటే మంచిది. వారితో గడిపిన సంతోష ఘడియలు, అల్లరి చేష్టలు గుర్తు చేసుకుంటే, మనసులో వుండే కోపం పూర్తిగా తొలగిపోయి మెదడులో వుండే మొత్తం స్ట్రెస్ తగ్గిపోతుంది.
కోపంలో డైరీ రాసేయండి..
ఎవరైనా కొంతమంది నచ్చని కొన్ని విషయాలను చెప్తే వెంటనే కోపంగా రియాక్ట్ అవుతుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలతో తప్పుడు పనులు కూడా చేస్తుంటారు. వెంటనే రియాక్ట్ కాకుండా కొద్దిసేపటివరకు కూల్‌గా ఆలోచించిన తర్వాత స్పందిస్తే మంచిది. ఆలోచించేంత సమయం లేకపోతే వెంటనే నచ్చిన పనిని అప్పటికప్పుడు నిర్వహిస్తే కోపం తగ్గే అవకాశాలు చాలా వుంటాయి.
ఎక్కువ కోపానికి గురైనప్పుడు తమ భావోద్వేగాలను ఇతరుల మీద ప్రదర్శించకుండా వాటిని ఒక డైరీలోనో లేదా సోషల్ నెట్ వర్కింగ్ బ్లాగుల్లో రాసుకుంటుంటే కోపం తగ్గే అవకాశం ఉంటుంది.
ధ్యానం ప్రధానం..
ప్రతిరోజూ ధ్యానం చేస్తే భావోద్వేగాల విషయంలో శక్తివంతమైన పట్టు సాధించడానికి దోహదపడుతుంది. ధ్యానం చేయడం వల్ల మెదడు చాలా ప్రశాంతంగా వుంటుంది. అలాగే వెంటనే కోపం రాకుండా ఉంచుతుంది ధ్యానం. దీంతో మానసికంగా ఎటువంటి ఒత్తిళ్లు వుండవు. శరీరం కూడా ప్రశాంతంగా వుంటూ, ఆరోగ్యంగా వుండటానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ సమయానుకూలంగా ధ్యానం చేస్తే చాలా మంచిది.
EmoticonEmoticon