ఓటర్‌/ ఆధార్‌/ పాన్‌/ రేషన్‌/ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డు పోయిందా అయితే ఇలా చేయండి


ఓటర్‌ గుర్తింపు కార్డు
కేవలం ఓటు వేయడానికే కాకుండా కొన్నిసార్లు నివాస, పుట్టిన తేదీ ధ్రువీకరణ గురించి గతంలో వాడిన ఈ కార్డును పోగొట్టుకుంటే పోలింగ్‌ బూత్‌నంబర్‌, కార్డునంబర్‌తో పది రూపాయలు చెల్లించి మీసేవా కేంద్రంలో మళ్లీ ఈ కార్డును పొందవచ్చు. కార్డు నంబర్‌ ఆధారంగా స్థానిక తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఈ కార్డును ఉచితంగా పొదవచ్చు. మరింత సమాచారం .ceotelangana.nic.in .సందర్శించి వివరాలను తెలుసుకోవచ్చు.



ఆధార్‌ కార్డు
ఈ కార్డు పోతే టోల్‌ ఫ్రీ నంబర్‌ 18001801947 కు కాల్‌ చేసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్తకార్డు మళ్లీ పోస్టులో పంపిస్తారు.help@uidai.gov.in   వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం పొందే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన సెంటర్‌లలో పుట్టిన తేదీ తప్ప మరే ఇతర సమాచారమైనా సరైన ఆధారాలను చూపించి మార్చుకునే అవకాశం ఉంది.

పాన్‌ కార్డు
ఆర్థిక లావాదేవీలలో పాన్‌ కార్డు ప్రస్తుతం చాలా కీలకం. ఆదాయపు పన్ను శాఖ అందజేసే పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌ కార్డు పోగొట్టుకుంటే సంబంధిత ఏజెన్సీలో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతో పాటు పాత పాన్‌కార్డు జిరాక్స్‌, రెండు కలర్‌ ఫోటోలు, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. కొత్త కార్డు కోసం మరో 90 రూపాయలు చెల్లించాలి. కొత్త కార్డు మంజూరుకు మూడు వారాల సమయం తీసుకోవచ్చు.  www.nsdlpan.com వెబ్‌సైట్లో మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

రేషన్‌ కార్డు
కుటుంబ అవసరాలకు ఈ కార్డు చాలా కీలకం. కేవలం ప్రభుత్వం అందించే సబ్సిడీ వస్తువుల కోసమే కాక పలు ధ్రువపత్రాలు పొందేందుకు రేషన్‌ కార్డును కీలక ఆధారంగా అడుగుతుంటారు. తెల్లకార్డు ఉంటే ప్రభుత్వం వైద్య ఆరోగ్య పథకం కూడా కల్పిస్తోంది. అందువల్ల పేద ప్రజల జీవితంలో ఈ కార్డుకు ప్రాధాన్యత ఎక్కువ. రేషన్‌ నంబర్‌తో స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సంప్రదించడం ద్వారా పరిశీలన జరిపిన అధికారులు అదే నంబర్‌పై నామ మాత్రపు రుసుముతో కార్డు జారీ చేస్తారు. లేదా  www.icfs2.ts.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి వివరాలు తెలియజేసి జిరాక్స్‌ కాపీ పొందవచ్చు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌
వాహనం నడిపేందుకు తప్పనిసరిగా ఉండాల్సిం ది డ్రైవింగ్‌ లైసెన్స్‌. ఈ కార్డు పోగొట్టుకున్న వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారందించే నాన్‌ ట్రేస్డ్‌ సర్టిఫికేట్‌తో పాటూ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ప్రతిని లాస్‌ ఆర్‌ డిస్ట్రక్షన్‌ అఫ్‌ లైసెన్స్‌ అండ్‌ అప్లికేషన్‌ ఫర్‌ డూప్లికేట్స్‌ ఫారమ్‌, ఎల్‌ఎల్‌డితో రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయంలో అందించాలి. అలాగే పది రూపాయల బాండ్‌ పేపర్‌ పై కార్డు పోయిన వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. తిరిగి కార్డును పొందడానికి సుమారు ముఫ్పై రోజుల సమయం పట్టవచ్చు. tstransport.org అనే వెబ్‌సైట్‌ నుంచి ఎల్‌ఎల్‌ డి ఫారమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని మరిన్ని వివరాలు పొందవచ్చు.
Previous
Next Post »