అందంగా కనిపించడానికి ముఖ్యమైంది చర్మం. ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపించాలంటే ముఖానికి వాడే క్రీములు, పౌడర్‌లొ కాదు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. శరీరానికి తీసుకునే ఆహారాలను బట్టే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అందుకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలేమిటో ఓసారి చూద్దామా.. స్త్రీ చర్మం నిగనిగలా డుతూ ఉండాలని కోరుకుంటుంది.
అయితే కాలుష్యం, ఎండ మొదలైన వాటి బారిన పడి చర్మం కమిలిపోవడం, తెల్లని మచ్చలు రావడం, గరుకుగా తయారవడం వంటివి జరగవచ్చు. ఇలాంటి దుష్పప్రభావాల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
ఆహారపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
* బొప్పాయి, అరటి, జామ, ఆపిల్ వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
* మంచినీరు ఎక్కువగా తాగడం మంచిది.
* నిమ్మ, ఉసిరి లాంటి పుల్లటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఉండే సి విటమిన్ మీ చర్మాన్ని కాపాడుతుంది.
* తేనెను అప్పుడప్పుడూ తీసుకోవడం వల్ల చర్మం పొడి బారకుండా తాజాగా ఉంటుంది.
* నానబెట్టిన బాదం పప్పును ఉదయాన్నే తసుకుంటే చర్మం పొడిబారదు.
రోజూ ఒక గుడ్డును తీసుకున్నా చర్మానికి మంచిది.
ఎక్కువగా పళ్లరసాలను తాగితే చర్మానికి గ్లో వస్తుంది.
చర్మ ఛాయకు..
* ఒక చిన్న పాత్రలో నారింజ తొక్కలు వేసి అయిదు నిమిషాలు మరిగించి దించి ఆ తొక్కలను చర్మంపై రాసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.
* కలబందను కొన్ని రోజుల పాటు చర్మానికి రాసుకుంటే ఫలితం కనబడుతుంది.
* ఒక టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జులో కొద్దిగా తేనె, కోడిగుడ్డు తెల్లసొన కలిపి చర్మానికి పట్టిస్తే చర్మం నిగనిగలాడుతుంది.
* టీస్పూన్ కీరాజ్యూస్‌లో కొంచెం నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* కొబ్బరి నూనెను చర్మమంతా వారానికి ఒకసారి మర్ధనా చేసుకోవాలి.
EmoticonEmoticon