ఇవన్నీ తమ ప్రేమను వ్యక్తం చేయడానికి, తమ మధ్య వారధులుగా ఈ మార్గాలను ఎంచుకునేవారు నాటి తరం ప్రేమికులు. ఇప్పుడూ అదే ప్రేమ... ప్రేమికులు మారలేదు.. కానీ కాలం మారింది. ప్రేమను వ్యక్తం చేసే మార్గాలు సుగమం అయ్యాయి. ఎదురు చూపులు అక్కర్లేదు. కాలు కాలిన పిల్లుల్లా అటు ఇటు తచ్చాడాల్సిన అవసరం అంతకన్నా లేదు.
ప్రేమ సందేశం చేరవేయడానికి తమ్ముళ్లను, చెల్లెళ్లను, స్నేహితులను బతిమిలా డాల్సిన అవసరం ససేమిరా లేదు. మస్కా కొట్టి మామూళ్లు ఇచ్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు.
ఇది రొమాంటిక్ జనరేషన్ ...
అర చేతిలో ఇమిడిపోయే సెల్ ఫోన్ ఉంటే చాలు.
ప్రపంచంలో యే మూల వున్నా సందేశం టక్కున వెళుతుంది.
చూపుడు వేలు చివరి బిందువు చాలు ఆకాశమంత ప్రేమను చాటుకోవడానికి !
ఇదంతా డిజిటల్ మాయ... డిజిటల్ ప్రేమ!
ఫేస్ బుక్.. ఇన్‌స్టాగ్రామ్.. ట్విట్టర్.. వాట్స్ ఆప్ ఇవీ ఇంకా ఇంకా సోషల్ మీడియాను ప్లాటుఫామ్‌గ చేసుకొని ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.
ప్రేమ లేఖలు దాచుకున్నట్టుగా ఓ ప్రేమ జంట ఇద్దరి మధ్య సాగిన వాట్స్‌ఆప్ ప్రేమ సందేశాలను దాదాపు యాభై వేల టెక్స్ట్ మెసేజ్‌లను పుస్తక రూపంలోకి మార్చుకొని భద్రంగా దాచుకున్నారట.
మిలేనియమ్ ప్రేమ జంటలు..
ఈ వెయ్యేళ్ళ ప్రేమ పూజారుల ప్రేమపూరిత సృజనాత్మకత కూడా రోజురోజుకు కొత్తదనం సంతరించుకోవడం ముచ్చటగా అనిపిస్తుంది. వీరు తమ భావోద్వేగాలను, ప్రేమను ఇచ్చి పుచ్చుకోవడం కోసం ఆప్స్‌ను బాగా వాడుకుంటున్నారు. ఆప్స్‌లో వుండే ఎమ్మోజీస్... ఎమోటికాన్స్ ప్రేమను వ్యక్తం చేయడానికి వారధిగా మారాయి. అన్నీ కూడా సంకేతాలే. ప్రేమకు కొత్త భాషను ఆవిష్కృతం చేసాయి ఎమోటికాన్లు.
స్టైల్‌గ సున్నితంగా ప్రేమను వ్యక్తం చేయడానికి ఏ సంకేతం ఏ అర్థాన్ని సూచిస్తుందో చూద్దాం.
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ తరం డిజిటల్ ప్రేమికులను పలకరించి చూడండి. బోలెడు పరిచయం చేస్తారు.పరిచయం ప్రారంభమై అది ప్రేమ గా మారి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పెళ్ళికి దారి తీసే వరకు ఈ ఎమోటికాన్లు, ఎమోజీలే వారికి ఆసరా,ఆలంబన తోడు, నీడ !
ప్రేమ భాషను పూర్తిగా మార్చేసి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూడకుండా ప్రేమికులను ఒకటి చేస్తున్న ఈ ప్రేమ చిహ్నాలు ప్రేమికులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయని అంటున్నారు భాషా ప్రవీణులు. సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలించినట్టు పిసరంత ఈ చిన్ని గుర్తు ఎంతో మంది ప్రేమికులను కలుపుతుందంటే ప్రేమ యెంతశక్తిమంతమైందో అర్థం చేసుకోవచ్చు.
* ఎర్రగా ఎగిసిపడే జ్వాలలు పాజిటివ్ అర్థాన్ని సూచిస్తాయట. ఎదుటి వారు ప్రేమలో చాల తెలివైన వారనే అర్థాన్ని తెలుపుతుంది ఈ సంకేతం. ప్రేమలో అబద్ధాలు. మాటలు ఏమార్చి చెప్పడం,దాటవేయడం, యిచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోవడం, ఆలస్యం, సోమరితనం, మామూలే. ఎక్కువగా అబ్బాయిలకు యివి అలవాటు.
వారి ఈ ప్రవర్తన నచ్చక అమ్మాయిలు ఈ సంకేతాన్ని పంపడం ద్వారా వారి అసహనాన్ని సూచిస్తున్నట్టు. అమ్మాయిలు హాట్ హాట్‌గ మారిపోతారు. యెంత నచ్చ చెప్పాలని చూసిన వారి మూడ్ మారదు. కోపంతో రగిలిపోవడం కూడా ప్రేమ కు సంకేతమేనని అంటున్నారు సైకాలజిస్టులు. అది ఒక రకంగా ప్రేమ జ్వరమని అంటున్నారు. హాట్ ఈస్ గుడ్ అని కితాబు కూడా ఇస్తున్నారు.
* పదమూడు పేక ముక్కల్లో ఆటీన్ ప్రేమకు చిహ్నం. ప్రేమను వ్యక్తం చేయడానికి హృదయం ఆకారంలో వుండే ఈ గుర్తును ఉపయోగిస్తారు. నా హృదయంలో నిదురించే చెలి అంటూ హృదయం ఇక్కడున్నది అంటూ సంకేతాలు పంపిస్తుంటారు. జాలి, దయ, కరుణ, అభిమానం, ఆప్యాయత, సహృదయత, సౌమ్యత మొదలైన సుగుణాలన్నీ ఈ సంకేతం ద్వారా ఎదుటివారికి చేరవేయొచ్చు.
* ప్రేమికుల మధ్య పొగడ్తలకు కరువుండదు. బాగా నచ్చేసరికి మెచ్చుకోళ్ళు వర్షం ల కురిపించడం పరిపాటి. పోదూ బడాయి అంటూ అబ్బాయిలను వెక్కిరించడం అట పట్టించడం అమ్మాయిలకు సరదా . పొగడ్తలకు జవాబుగా నాలిక బయటపెట్టి వెక్కిరించే ఈ యిమోటికాన్ వాడడం అమ్మాయిలకు అలవాటు.
* కళ్ళు హృదయాకారం లో వుండి స్మైలింగ్ ఫేస్ వున్న ఈ బొమ్మ ఎదుటివారిని ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు అర్థం. అంతే కాదు ప్రేమ లోతులో వున్నానని, నిజాయితీగా, నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం. నా ప్రేమను సీరియస్ గా తీసుకొమ్మని, విన్నవించుకోవడం.
* ప్రేమను రొమాంటిక్ గ వ్యక్తపరచడాన్ని ఈ బొమ్మ తెలుపుతుంది. నీ ప్రేమలో నిండా మునిగి వున్నానని అర్థం చేసుకొమ్మని సందేశం చేరవేయడమన్న మాట.
* మనస్పర్థలు చోటుచేసుకున్నప్పుడు ఎదుటివారిని సమాధాన పరచడానికి దీనిని ఉపయోగిస్తారు. ప్రశాంతంగా, నిదానంగా, అల్లరి చేసుకోకుండా మనసు కుదురు చేసుకొని కూల్‌గ ఆలోచిస్తే సరి పోతుందనే సందేశం దీని ద్వారా వ్యక్తం చేయడం.
* ఇద్దరి మధ్య రొమాంటిక్ ముచ్చట జరుగుతున్నప్పుడు అమ్మాయిలు సిగ్గుపడడం, సున్నితంగా నవ్వడం, ఒక్కసారి బుగ్గలు ఎరుపెక్కడం మామూలే. మాటల్లో వ్యక్తం చేయడం కూడా ఇబ్బందిగానే ఫీలవుతారు. టక్కున ఈ యిమోజీ ని షేర్ చేసి తమ హృదయ స్పందనను తెలియజేస్తారు అమ్మాయిలు. ఇది చూడగానే అబ్బాయిలు ఫ్లాట్ అవ్వాల్సిందే మరి.
* ఆరాధ్య దేవతగా భావిస్తున్నట్టు ఈ గుర్తుకు అర్థం. హృదయ సుందరి, స్వప్న సుందరి నీవే అని ఈ ఇమ్మోజీ ద్వారా వ్యక్తం చేయడం. మనసారా ప్రేమించిన వ్యక్తి ప్రతి కదలికా అద్భుతంగా,అందంగా, అనిర్వచనీయంగా కనిపిస్తుంది. ఈ భావాలను వ్యక్తం చేయడానికి ఈ చిహ్నాన్ని ఎంచుకుంటారు.
EmoticonEmoticon