పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఇంకేంటి పెళ్లిలో ప్రత్యేకంగా కనపడాలన్నా.. పెళ్లికి తగ్గట్టుగా అందంగా ముస్తాబు అవ్వాలన్నా అందుకు పట్టు పరికిణీలే ప్రధానం. అందాన్ని రెట్టింపు చేసి, చిన్నారులను ముద్దుగా, బొద్దుగా కనిపించేలా చేస్తాయి. పట్టు దుస్తులంటే అందరికీ ఇష్టమే. పెద్దలకు అందంగా నప్పే పట్టు వస్త్రాలు. చిన్నారులకు ఇంకా అందాన్నిస్తాయి.
చిన్నారులకు పట్టు పరికిణి వేసి, వడ్డాణం పెట్టి, చిన్న నెక్లెస్ పెట్టి, జడ గంటలతో జడను ముస్తాబు చేసి, పూలతో అలంకరిస్తే అబ్బా ఎంత బాగుంటారో చిన్నారులు కదా! వారి కలర్‌కు నప్పే రంగును ఎంచుకొని ఇలా రెడీ చేస్తే మీకే కాదు. చూసే వాళ్లకు బంధువులకు ముద్దుగా కనిపిస్తారు. మరి మీరూ మీ పిల్లలని కూడా ఇలాగే ముస్తాబు చేసి మురిసిపోండి.
EmoticonEmoticon