అనుబంధం పదిలమేనా?





భార్యాభర్తల బంధం కొనసాగాలంటే, ఒకరిపై ఒకరికి నమ్మకం, ఒకరి సమక్షంలో మరొకరు సంతోషంగా ఉండడం ముఖ్యం. దాపరికాలు, అసంతృప్తి లేని బంధం కలకాలం సంతోషంగా ఉంటుంది. బరువనుకోకుండా బాధ్యతగా భావించేదే కుటుంబం. ఆకాశంలోనైనా, అగాధంలోనైనా, నీవెంటే నేనున్నా అనే భావనే భార్యాభర్తల బంధానికి గొప్ప భరోసా. బరువనుకొని వదిలేసేది బంధమూ కాదు.. అలాంటి భావనలో భరోసా ఉండదు..




బంధంలో విజయవంతంగా కొనసాగేందుకు ఎలాంటి మ్యాజికల్ ఫార్ములా లేదు. అది ప్రేమ, వివాహ, లివింగ్ టుగెదర్... ఇలా, ఏ బంధమైనా ఇబ్బందులు ఉండడం సాధారణమే. ఒక్కో సారి మనల్ని మనమే ఇష్టపడం, అలాంటిది మనం బాండ్ అయిన వ్యక్తిలో అన్నీ నచ్చాలని లేదు. సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే ఆ రిలేషన్‌లో పొరాపొచ్చాలు వచ్చి, గాలివానలా మారతాయి. ఇవి భాగస్వాములిద్దరినీ మరింత దూరం చేస్తాయి.  అందుకే ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చినప్పుడు సర్దుకు పోవాలి, కాంప్రమైజ్ కావాలి. కాని ఒక్కో సారి సమస్యను సాల్వ్ చేసుకోవడం సమస్యగా మారుతుంది.

ఇది మీ బుర్రను వేడెక్కించి, అశాంతిని మిగిలిస్తుంది. ఒక్కో సారి ఆ బంధంలో కొనసాగాలా? వద్దా? అనే మీమాంస కూడా వచ్చేస్తుంది. అయితే పరిష్కారం దొరకని సమస్య అయితే మాత్రం ఆ బంధంలో నిలవడం కంటే విడిపోవడం మంచిది. సమస్యలను ఎలా విశ్లేషించుకోవాలన్నది కూడా పెద్ద ప్రశ్నే, అందుకే ఈ రకంగా ప్రయత్నించండి...

భాగస్వాముల మధ్య ఆప్యాయత లోపించినప్పడు

మాటల్లో కాని చేతల్లో కాని ప్రేమ, ఆప్యాయతను చూపించలేకపోతుంటే, సరిగ్గా ఇదే పరిస్థితి అవతలి వారిలో కూడా ఉంటే, కచ్చితంగా పరిష్కారం ఆలోచించాల్సిందే. భార్యాభర్తలిద్దరూ శారీరకంగా కలిసి, చాలా రోజులైనా, ఇద్దరి మధ్య దూరం పెరుగుతోందని గమనించాలి. భావోద్వేగాల పరంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నా  కూడా మీ రిలేషన్ గూర్చి రివ్యూ చేసుకోవాలి. అప్పుడే సమస్య పరిష్కారానికి మార్గం దొరుకుతుంది.

మొదట్లోలా లేనప్పుడు

రిలేషన్‌షిప్ మొదలుపెట్టే సమయంలో భాగస్వామిపై ఉన్న ప్యాషన్ ఆ తర్వాత లేకపోతే, ఆ జీవితం దుర్భరంగా మారుతుంది. జీవిత భాగస్వామితో గడిపే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి, వారిపై మీ ప్రేమను ప్రదర్శించాలి. అలా జరగనప్పుడు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే ప్రమాదం ఉంది. అది మీ మధ్య దూరం పెరగడానికి కారణమవుతుంది. మీరిద్దరూ ఆనందంగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకోవడం ద్వారా మీ మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చుకొని, ప్రేమని చిగురింపజేయొచ్చు. మీ ప్రేమను మీ బంధాన్ని నిలబెట్టుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మీ అందమైన జీవితం కోసం, మీరు గడిపిన ఆనందకరమైన క్షణాలను మరొక్కసారి గుర్తుచేసుకుంటారు కదూ..

ఇద్దరి జీవిత లక్ష్యాలు వేరుగా ఉన్నప్పుడు


ఎప్పుడైతే బంధం బలహీనమవుతుందో అవతలి వారిలో లోపాలే కనిపిస్తూంటాయి. రిలేషన్‌షిప్ మొదలయ్యే సమయంలో నచ్చిన విషయాలు ఆ బంధం బలహీనమైనప్పుడు సహించలేనివిగా తయారవుతాయి. ఇద్దరి ఆలోచనలు వేరు వేరుగా ఉన్న ప్పుడు, వారి మాటల మధ్య పొంతన లేన ప్పుడు, వారి మధ్య మనస్పర్ధలు మొదలవుతాయి. ఇలా ఇద్దరిదీ చెరో దారి ఉంటుంది, ఇలాంటి సమయంలోనే భార్య భర్తలిద్దరు సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటికీ కలిసుండడం సాధ్యం కాదనిపిస్తే విడిపోవడం ఉత్తమం
Previous
Next Post »