టీనేజ్‌తో మొదలయ్యే ముఖచర్మ సమస్యలు జీవితకాలం వేధిస్తూనే ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్యే. అయితే వీటిని నివారించేందుకు ఒక్కోసారి టైముండదు. ఇవి చాలా ఖరీదైనవి కావచ్చు. కొన్ని రకాల కెమికల్స్ కొందరి శరీర తత్వాలకి పడకపోవచ్చు, అయితే ఇలాంటి వారికోసం వంటింటి వస్తువులతో ముఖాన్ని మెరిపించేందుకు ఉపయోగపడే ప్యాక్స్ వివరాలు...
అలోవేరా, పసుపు ప్యాక్
ఒక టేబుల్ స్పూన్ అలోవేరా జెల్, అర టేబుల్ స్పూన్ పసుపు.
తయారుచేయు విధానం
అలోవేరా జెల్, పసుపుని కలిపి ముఖానికి మృదువుగా అప్లు చేయాలి. పావు గంట తర్వాత కడిగేసి శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. వారంలో రెండు మూడు సార్లు ఇలా చేయొచ్చు.
పనిచేయు విధానం
అలోవేరా వల్ల చర్మం మెరుస్తూ, టాక్సిన్‌ల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. పసుపులో ఉండే సహజ యాంటీ బాక్టీరియల్, నొప్పి నివారణ గుణాలు చర్మంపై దద్దుర్లు, వాపు రాకుండా చేస్తుంది.
వేప, రోజ్ వాటర్ ప్యాక్
కావల్సిన పదార్థాలు
ఒక టేబుల్ స్పూన్ వేపపొడి, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్, వేపపొడి. రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు పట్టించాలి. పావు గంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. వారంలో మూడు నాలుగు సార్లు ఈ ప్యాక్ వేసుకోవచ్చు.
పనిచేయు విధానం
ముఖ చర్మంపై యాక్నేకు కారణమైన బాక్టీరియా పెరగకుండా వేప అడ్డుకుంటుంది, చర్మం ఎర్రబారటం, వాపు రాకుండా కూడా వేప రక్షిస్తుంది.
శాండల్‌వుడ్, రోజ్ వాటర్ ప్యాక్
కావల్సిన పదార్థాలు
ఒక టేబుల్‌స్పూన్ శాండల్‌వుడ్ పౌడర్, రెండు టేబుల్‌స్పూన్ల రోజ్ వాటర్
ఈ రెంటినీ ఒక బౌల్‌లో కలిపి ముఖానికి, మెడకు అప్లు చేయాలి. పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసి ఆరనివ్వాలి. ఈ ప్యాక్ వారంలో మూడు, నాలుగు సార్లు వేసుకోవచ్చు.
పనిచేయు విధానం
శాండల్‌వుడ్‌లో యాస్ట్రింజెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి చర్మాన్ని బిగుతుగా ఉండేలా చేస్తూ, దద్దుర్లు, ర్యాషెస్‌ను నివారించి చర్మానికి హాయినిస్తుంది.
ముల్తానీ మిట్టి, లెమన్ ప్యాక్
కావల్సిన పదార్థాలు
ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి, సగం నిమ్మచెక్క.
ముల్తానీ మట్టిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని దాన్లో నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మృదువుగా ముఖానికి అప్లు చేసి ఆరగంటసేపు ఉంచాలి. అరగంట తర్వాత శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. ఇలా వారంలో రెండు సార్లు వేసుకోవచ్చు.
పనిచేయు విధానం
ముఖచర్మంపై ఉన్న అధిక నూనెలను ముల్తానీ మిట్టి తొలగిస్తుంది. చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా చేస్తుంది. ఇందులో పుష్కలంగా లభించే మెగ్నీషియం, క్లోరైడ్‌లు యాక్నేను దూరం చేస్తాయి.
దాల్చెన చెక్క, నిమ్మ ప్యాక్
కావల్సిన పదార్థాలు
ఒక టేబుల్ స్పూన్ దాల్చెన చెక్క పౌడర్, రెండు టేబుల్ స్పూన్‌ల నిమ్మరసం. ఈ రెంటినీ కలిపి ముఖానికి అప్లు చేయాలి. అరగంట తర్వాత శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. ఇలా వారంలో రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవచ్చు.
పనిచేయు విధానం
యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దాల్చినలో ఉన్నాయి. ఇవి యాక్నే నివారణలో పనిచేస్తాయి. నిమ్మలో ఉండే విటమిన్ సి చర్మానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది.
తేనె, నిమ్మరసం ప్యాక్
కావల్సిన పదార్థాలు
ఒక టేబుల్‌స్పూన్ తేనె, సగం నిమ్మ చెక్క.
తయారుచేయు విధానం
చిన్న గిన్నెలో తేనె తీసుకుని దానిలో నిమ్మరసం పిండి రెంటినీ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మృదువుగా అప్లుచేసి, పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడిగి ఆరనివ్వాలి. ప్రతి రోజూ ఈ మాస్క్ వేసుకోవచ్చు.
పనిచేయు విధానం
సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలున్న తేనె యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది కేవలం బాక్టీరియాను తీసేయడమే కాకుండా చర్మంలో తేమను కాపాడుతుంది. దాంతో చర్మం కాంతివంతమవుతుంది. నిమ్మ, చర్మంపై ఉండే మృతకణాలను తొలిగిస్తూ, బ్లాక్‌హెడ్స్‌ను నివారిస్తుంది.
EmoticonEmoticon