పండ్లు, కూరగాయలు, ఏవైనా సరే, భూమిలో పండించేవి. నీళ్లు, ఎరువులు, మట్టి వీటిలో ఏదో ఒక రకంగా కొంత బాక్టీరియా పండ్లు, కూరగాయాలు, ఆకుకూరల మీద చేరుతుంది. ఈ హానీ కరమైన బాక్టీరియాను నివారించడానికి వాటిని ఉపయోగించే ముందు శుభ్రంగా కడిగి తర్వాత వినియోగించుకోవాలి. అలా చేరిన బాక్టీరియాను శుభ్రంగా తొలగించకుడా వినియోగించినట్లైతే అది ఫుడ్ పాయిజన్ కు దారితీస్తుంది. మార్కెట్ నుండి తెచ్చినవి ఏవైనా సరే శుభ్రంగా కడిగి తర్వాత వండుకోవాలని తప్పక గుర్తుంచుకోవల్సిన విషయం. హానికర బాక్టీరియాను తొలగించడానికి ఈజీ టిప్స్ మీ కోసం..
వెనిగర్
పండ్లు, కూరగాయల మీద చేరిన క్రిములను, బాక్టీరియాను నాశనం చేసే వాటిలో వెనిగర్ ఒకటి. ఒక బకెట్ లో కొద్దిగా నీళ్లు నింపి, అందులో వైట్ వెనిగర్ ఒక కప్పు వేసుకోవాలి. ఆనీటిలో 5నిముషాలు పండ్లు, కూరగాయలు వేయడం వల్ల బాక్టీరియా నాశనం అవుతుంది.
బేకింగ్ సోడా
ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మీద చేరిన ఫెస్టిసైడ్స్ ను చాలా ఎఫెక్టివ్ గా తగ్గించడంలో బేకింగ్ సోడా బాగా ఉపయోగపడుతుంది. ఒక బకెట్‌లో నీటిని నింపి, అందులో ఒక 4 చెంచాలా బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయాలి, ఈ నీటిలో కూరగాయలు, పండ్లు 15 నిముషాల తర్వాత శుభ్రం చేసి, తిరిగి మంచి నీటితో కడిగి ఉపయోగించుకోవాలి. తర్వాత పొడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి.
పసుపు
పసుపులో యాంటీబాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది కూరలు, పండ్లలోని క్రిములను చాలా ఎఫెక్టివ్‌తగా నాశనం చేస్తుంది.
EmoticonEmoticon