లెహంగాల సోయగాలు..




పెళ్లి సందళ్లు మొదలయ్యాయి. కొత్త బట్టలు, నగలు, గాజులంటూ షాపింగ్‌లు తెగ చేసేస్తున్నారు అందరు. కానీ ఈసారి వెరైటీగా యువత ఒకే రకమైన డ్రస్సింగ్‌ను ఎంచుకోవడం విశేషం! పెళ్లిళ్లు, నిశ్చితార్థం, బర్త్‌డేస్‌కి ఇలా వేడుక ఏదైనా అమ్మాయిలు లెహంగాల వైపే మొగ్గు చూపుతున్నారు. శుభకార్యాల్లో ప్రత్యేకంగా కనిపించేందుకు యువతకే కాదండోయ్, చిన్నారులకు కూడా లెహంగాల సెలక్షన్ చాలా బాగుంటుంది. శరీర ఛాయను బట్టి రంగును ఎంచుకుంటే ఆ లుక్కే వేరబ్బా..



ఉత్తర భారతదేశ పోకడలను యువత ఎక్కువగా అనుసరించడం వల్ల పెళ్ళిళ్లలోని సంగీత్, మెహెందీ వేడుకల్లో లెహంగాలు ఆహా.. అనిపిస్తున్నాయి. పెళ్ళికూతురుతో పాటు మిగిలిన అమ్మాయిలు కూడా వేడుకల్లో  లెహంగాలను అనుకరించడం సాధారణమైపోయింది. వీటిని లంగా ఓణి, క్రాప్ టాప్, చోళి ఇలా వైవిధ్యమైన వస్త్రధారణలో ఎన్నుకోవచ్చు. అయితే వీటిని ఎంచుకునే ముందు కొన్ని చిట్కాలను తప్పనిసరిగా పాటించాలి. అవేంటో చూసేద్దామా..



* రిసెప్షన్‌కి లెహంగాను ఎంచుకుంటే అది మీకు కంఫర్ట్‌గా ఉందో లేదో ముందుగానే ట్రైల్ వేసి చూసుకోవాలి. ఎందుకంటే అటు ఇటు తిరగడంలో ఇబ్బంది కాకుండా వీలైనంత కంఫర్ట్‌గా ఉండేలా మీ శరీర రంగుకు నప్పే రంగును సెలెక్ట్ చేసుకోవాలి. డ్రస్సింగ్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. 

* లెహంగా మీ ఎత్తుకు సరిగ్గా కాకుండా కాస్త పెద్ద సైజ్‌ను అంటే పొడవు ఎక్కువగా ఉండేలా ఎంచుకోవాలి. సరిగ్గా పాదాల వరకే వస్తే చూడటానికి బాగుండదు. హిల్స్ వేసుకున్నప్పుడు లెహంగా పొట్టిగా కనిపిస్తే డ్రస్‌లుక్ చెదిరిపోతుంది. కాబట్టి పొడవుగా ఉండి నేలపై జీరాడే లెహంగాను ఎంచుకోవాలి.

* షాపింగ్ మాల్స్ వెలుగుల్లో లెహంగాలు ఒక మాదిరిగా మరో కలర్‌గా కనిపిస్తాయి. కాబట్టి వేసుకున్నప్పుడు ఫోటో తీసుకొని చూసుకుంటే నప్పిందా లేదా ఈజీగా తెలుస్తుంది. 

* బ్యాక్‌లెస్, నెట్టెడ్, డీప్‌నెక్, క్రాప్‌టాప్ ఎంచుకుంటే, ఇన్నర్ దుస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి వాటిని కూడా వేసుకుని చూస్తే మంచిది.



* లెహంగా డోరీలు కట్టుకోడానికి అనువుగా ఉన్నాయా చూసుకొని, లెహంగా బరువు ఎక్కువగా ఉంటే డోరీలు లెహంగా బరువును ఆపలేవు. అప్పుడు వాటికి ప్రత్యామ్నాయాలు వెతుక్కోవలసి వస్తుంది. కాబట్టి లెహంగాను ఎంచుకునేటప్పుడే ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

* వాతావరణాన్ని బట్టి లెహంగాలను ఎంచుకోవాలి. లెహంగాలకు వాడే వస్త్రం ఎలాంటిదో సరిచూసుకొని చలికాలం అయితే మక్మల్, సిల్క్ తరహావి, ఎండాకాలంలో కాటన్, ఇక్కత్ వంటివి ఎంచుకుంటే సౌకర్యంగా, ట్రెండీగానూ ఉంటాయి.
Previous
Next Post »