నిద్ర పట్టట్లేదా..?
* పొగతాగే అలవాటును పూర్తిగా మానుకోవాలి.
* బెడ్రూమ్ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. మరీ చల్లగానూ, మరీ వేడిగా కాకుండా ఉండాలి.
* నిద్ర వేళలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి.
* సాయంత్రం పూట కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్‌ను తీసుకోకూడదు.
* రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. పగటి పూట కునుకు తీయవచ్చు. ఎక్కువసేపు నిద్రపోకూడదు. ప్రతీ రోజు ఒకేలా సరైన టైమ్‌కి నిద్ర పోవాలి.
* నిద్ర పోయే ముందు టీవీలో బాధ, ఏడుపును కలిగించే సీన్ ఉన్న సినిమాలూ, సీరియళ్ళు చూడకూడదు.
* రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపయినా పగటి వెలుగులో గడపాలి.
* వెలుతురు సరిగా లేని రూమ్‌లో గడిపేవారికి రాత్రి వేళల్లో సరిగా నిద్రపట్టదు.
* నిద్రకు ముందు ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినాలి.
* గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్రపడుతుంది.
* నిద్రపోయే ముందు పుస్తకాలు చదవకూడదు. పుస్తకం చదువుతూ వుంటే అలా మనకు తెలియకుండానే నిద్రపడుతుందని చాలా మంది అంటారు. కానీ... నిజానికి దృష్టి పూర్తిగా చదవడంలో నిమగ్నమైపోతే నిద్రకు దూరమైయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది.
EmoticonEmoticon