రోజూ ఆఫీస్ కు వెళ్తున్నప్పుడు రొటీన్ గా మీరు వెళ్తారు. ప్రతి రోజూ ది బెస్ట్ గా కనిపించడం కాస్తంత కష్టమే. ఒకవైపు ఇంటినీ మరోవైపు ఆఫీస్ ను బ్యాలన్స్ చేస్తూ ప్రొఫెషనల్ అలాగే పర్సనల్ లైఫ్ బ్యాలన్స్ చేస్తున్న వారికి రోజూ ఆఫీస్ కి ప్రత్యేకంగా తయారై వెళ్లాల్సి రావడం కష్టంగా ఉండటం సహజమే. అలాంటి వారి కోసమే ఈ టిప్స్.
నాటెడ్ పోనీటేల్:
ముందుగా మీ హెయిర్‌ను శుభ్రం చేసుకుని రిన్స్ చేసుకొండి. మీరు పాటించే రెగ్యులర్ పదతిలోనే షాంపూ మరియు కండిషనర్ తో రిన్స్ చేసుకొండి. మీ హెయిర్ ఆరిపోయినప్పుడు, ఏదైనా హీట్ ప్రొటెక్షన్ ను ప్రయత్నించి ఆ తరువాత హెయిర్ ను కర్ల్ చేసుకొండి. ఇప్పుడు ఒక ఇంచ్ హెయిర్ ను కర్లింగ్ ఐరన్ లో కి తీసుకుని హెయిర్ కు బౌన్సీ లుక్ ను అందించండి. ఇప్పుడు, పోనీ టెయిల్ ను వేసుకొండి. హెయిర్ మొత్తాన్నీ పోనీ టెయిల్ గా మార్చకండి. కొంత హెయిర్ ను పోనీ కింద ఉండేలా చూసుకొండి.
మెడ వెనుక భాగం వద్ద కాస్తంత హెయిర్ ను ఫ్రీగా వదలండి. ఆ తరువాత హెయిర్ స్ప్రే ను చల్లుకొండి. ఇప్పుడు పెర్ఫెక్ట్ లుక్ వస్తుంది. రోజంతా ఈ లుక్ క్యారీ అవుతుంది. ఇప్పుడు, ఫ్రీ గా ఉంచిన హెయిర్ ను సెక్షన్స్ గా తీసుకుంటూ ఎలాస్టిక్ బ్యాండ్ పై నుంచి కవర్ చేసుకుంటూ రావాలి. ఇలా రెండు వైపులా బాటమ్ సెక్షన్స్ అన్నీ, కవర్ అయ్యేలా ఒక దానిపై ఒకటి x షేప్ లో లేస్ చేయాలి. ఆఖరి స్టెప్ గా, ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ తో హెయిర్ ను టై చేయాలి. ఇప్పుడు, ఈ నాటెడ్ పోనీటెయిల్ లుక్ తో ఆఫీస్ పార్టీలో రాక్ చేయండి.
EmoticonEmoticon