మృదువైన పాదాలను పొందాలని ఎవరికుండదు. మనలో చాలా మంది డ్రై లేదా ఫ్లేకీ స్కిన్ సమస్యతో ఇబ్బంది పడతారు. ఈ సమస్య ముఖ్యంగా పాదాలపై కనిపిస్తే పాదాల సౌందర్యం దెబ్బతింటుంది. నిజమే కదా పాదాల సౌందర్యాన్ని సంరక్షించుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే, పాదాలు ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుంటాయి.
ఫుట్ కేర్ టిప్స్ చాలా మంది కేవలం ముఖాన్ని అలాగే చేతులను అందంగా ఉంచుకునేందుకు శ్రద్ధ పెడతారు. రకరకాల క్రీమ్స్‌ను వాడతారు. పాదాలపై అశ్రద్ధ కనబరుస్తారు. మార్కెట్‌లో అనేక రెడీమేడ్ క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయి. పాదాలపై వీటిని అప్లై చేస్తే పాదాల సౌందర్యం మెరుగవుతుంది. అయితే, ఖర్చుతో కూడుకున్న పని ఇది. అలాగే, తరచూ పార్లర్‌కి వెళ్లి పెడిక్యూర్ చేయించుకోవడం ఈ సమస్యకు పరిష్కారం కాదు. ఆరోగ్యకరమైన, అందమైన పాదాలను పొందేందుకు ఫుట్ కేర్ టిప్స్ మీకోసం... వీటిని పాటించడం ద్వారా పాదాల నొప్పులను తగ్గించుకుని, బాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణను పొందవచ్చు.
మాయిశ్చరైజింగ్
పాదాల అందాన్ని మెయింటెన్ చేయడంలో మాయిశ్చరైజింగ్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ పాదాలు రోజంతా స్ట్రెయిన్ అవుతాయి. ముఖ్యంగా మీరు ట్రావెలింగ్ జాబ్ చేస్తున్నట్టయితే పాదాలపై మీరు మరింత శ్రద్ధ కనబరచాలి. అందువలన, రోజంతా పాదాలను మాయి శ్చరైజ్ చేయాలి.
ఎండ నుంచి పాదాలను కాపాడుకొండి
స్కిన్ కేర్ లో సన్‌స్క్రీన్ క్రీమ్ పాత్ర అనిర్వచనీయం. బయటికి వెళ్లేటప్పుడు ఎస్ పీ ఎఫ్ 30 లేదా అంతకంటే ఎక్కువ సన్ స్క్రీన్‌ను వాడాలి. తద్వారా పాదాలపై హానికర యువీ రేస్ పడకుండా జాగ్రత్త పడొచ్చు. రోజు పూర్తయినప్పుడు మీ పాదాలను ఒక టబ్బు వెచ్చటి నీటిలో ఉంచి టవల్ తో వైప్ చేయాలి.
నెయిల్ పాలిష్‌ను రిమూవ్ చేయాలి
కొత్త నెయిల్ పాలిష్ ను అప్లై చేసే ముందు పాత నెయిల్ పాలిష్ ను తొలగించడం మరచిపోకండి. మీకు కుదిరితే, పాలిష్ లేకుండా గోళ్లను కొన్ని గంటల వరకు ఉంచండి. ఆ తరువాత పాలిష్ ను అప్లై చేస్తే గోళ్లు బలపడతాయి. రిమూవర్ తో పాత నెయిల్ పాలిష్ ను తొలగించడం మంచిది. స్క్రబ్ మీ పాదాలు మృదువుగా అలాగే కోమలంగా ఉండేందుకు పాదాలపై ఉన్న డెడ్ స్కిన్ ను రిమూవ్ చేయడం తప్పనిసరి. స్క్రబ్బింగ్ చేస్తున్నప్పుడు పాదాలపై ఎక్కువ ఒత్తిడి పడకుండా చేసుకోండి. మీరు ఇంట్లోనే ఈ స్క్రబ్ ను సులభంగా వాడవచ్చు.
పనిచేయు విధానం
షుగర్ లేదా సాల్ట్‌ను బేబీ ఆయిల్ లో కలిపి చిక్కటి మిశ్రమంలా తయారుచేసి హోమ్‌మేడ్ ఫుట్ స్క్రబ్ ను తయారుచేసుకోవచ్చు. ఈ పేస్ట్ ను పాదాలపై అప్లై చేసి ఆ తరువాత 5 నిమిషాల పాటు సర్క్యూలర్ లోషన్స్‌తో మసాజ్ చేయాలి. ఆ తరువాత ప్యూమిస్ స్టోన్ స్క్రబ్ తో స్క్రబ్బింగ్ ను ఫినిష్ చేయండి. మీ పాదాలను చల్లటి నీటిలో రిన్స్ చేయాలి. ఆ తరువాత టవల్ తో తుడుచుకుని ఫుట్ క్రీమ్ ను అప్లై చేసుకోవాలి.
ప్రతి రోజూ మసాజ్ చేయండి
తరచూ ఫుట్ మసాజ్ చేయడం వలన పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఫుట్ ప్రాబ్లెమ్స్ తలెత్తవు. రోజుకు 5 నిముషాల మీ బిజీ షెడ్యూల్ నుంచి పాదాల మసాజ్ కు కేటాయించండి. వార్మ్ ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్‌ను వాడండి.
EmoticonEmoticon