చిన్నారులకు ఏ పనులు చెప్పకుండా, అసలు కష్టం తెలియకుండా పెంచుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. దీనివల్ల పిల్లలు పెరుగుతున్నా పనులు బాధ్యత తెలియకుండా పోతోంది. పనుల్లో భాగస్వాముల్ని చేయడం వల్ల, మీ కష్టం అర్ధం కావడం మాత్రమే కాదు, వ్యక్తిత్వ పాఠాలు నేర్చుకుంటారు.
పిల్లల్ని ఒక్కసారిగా ’నువ్వు ఈ పని చేయమని’ ఆర్డర్లు వేయకూడదు, వారికి అసలు అమ్మగా మీ దిన చర్య ఏంటో తెలియజేయాలి.
చిన్నారులకి అన్నీ అమర్చి, సమయానికి బడికి పంపుతున్నారంటే , దాని వెనుక మీరు పడే కష్టం వారికి అర్థమయ్యేలా చూడాలి. అలా వివరించే క్రమంలో చిన్నారులు అడిగే సందేహాలను తప్పకుండా తీర్చాలి. అంతేకాదు ఇంటి పనుల కోసం ఎలాంటి ప్రణాళిక వేసుకుంటారు. అందుకోసం అన్నీ ఎలా సమన్వయం చేసుకుంటారనేది వాళ్లకి అర్థమయ్యేలా చూడాలి. ఎలాంటి పనులు చిన్నారులు చెయ్యొచ్చో వారికి తెలియజెప్పాలి. తమ గది తాము సర్దుకోవడం, దుస్తులు మడత పెట్టుకోవడం, దగ్గర్లో ఉన్న దుకాణానికి వెళ్లి కావల్సినవి కొనుక్కురావడం, కూరగాయలు కడగడం, కోసివ్వడం లాంటివి స్వంతంగా చేసుకునేలా అలవాటు చేయాలి.
ముఖ్యంగా పిల్లలకు పోటీలు, బహుమతులంటే, చాలా ఇష్టపడతారు. మీ ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే మీలో ఎవరు పలానా పని త్వరగా చేస్తారో చూద్దాం అంటూ పోటీ పెట్టండి. ‘నేనంటే.. నేనని’ ఒకరికొకరు పోటీపడతారు. ఇది వారి మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది. అలా చిన్నారులు ఏ పనిచేసినా వెంటనే ఎంత బాగా చేశావో అంటూ మెచ్చుకున్నా, చిన్న బహుమతి ఇచ్చినా, వారిలో ఉత్సాహం మరింత రెట్టింపవుతుంది.
EmoticonEmoticon