నెగెటివ్ ఎనర్జీ పోవాలంటే రోజూ ఇలా చేయండి




మానసిక ప్రశాంతత కావాలంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ లేకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీని దూరం చేసుకోవచ్చు.

* ఇంట్లోకి ధారాళంగా వెలుతురు, గాలి వచ్చేలా కిటికీలన్నీ తెరచి ఉంచండి. సూర్యకిరణాలు ఇంట్లో పడేలా చూసుకోండి. గాలి, సూర్యకిరణాలు నెగెటివ్ ఎనర్జీని తొలగిస్తాయి.
* ఉండే పాత వస్తువులను, పనికిరాని వస్తువులను తొలగించండి. పాత వస్తువులు నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.


* గతంలో చెప్పులను ఇంటి బయటే విడిచి కాళ్లు నీళ్లతో కడుక్కుని ఇంట్లోకి వచ్చేవారు. దీనివల్ల నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేది కాదు. ఇప్పుడు కూడా అదే పద్ధతి పాటించడం వల్ల నెగెటివ్ ఎనర్జీ ఇంటి దరిచేరకుండా చూసుకోవచ్చు.
* పార్క్లో లేదా విశాలమైన మైదానంలో కాసేపు నడవండి. ప్రకృతికి దగ్గరగా గడపడం వల్ల శరీరం ఉత్తేజం పొందుతుంది.


* ఇంటిని రోజూ ఊడవడం వల్ల దుమ్ముతో పాటు నెగెటివ్ ఎనర్జీ వెళ్లిపోతుంది.
* బకెట్ నీటిలో కొద్దిగా రాక్సాల్ట్ వేసి ఆ నీటితో ఇల్లు తుడిచినా నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.


* బాల్కనీలో, ఇంటి గది మూలల్లో కుండీల్లో పూల మొక్కలు పెంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుంది.
* ఇంట్లో ప్రార్థనలు చేయడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి.
Previous
Next Post »