నిమ్మ లో ఉన్న ఔషధగుణాలు




మంచినీటిలో నిమ్మరసం కలిపి తాగితే ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది. కూరలపై నిమ్మరసం పిండుకుంటే అదోరకం రుచి. 


ఇలా నిమ్మకాయలను తరచుగా వాడుతూనే ఉంటాం గానీ వీటి ల్లోని ఔషధగుణాల గురించి చాలామందికి తెలియదు. నిమ్మవల్ల ఉపయోగకరమైన కొన్ని విషయాలు. నిమ్మలోని పులుపు గుణాలు జీర్ణరసాలు ఉత్పత్తి కావటానికి తోడ్పడతాయి. దీంతో జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఫలితంగా ఆహారంలోని పోషకాలను శరీరం బాగా గ్రహించుకోగలుగుతుంది. ఇది మూత్రంలో సిట్రేట్‌ మోతాదులు పెరిగేలా చేస్తుంది. ఈ సిట్రేట్‌ మూత్రంలోని కాల్షియానికి అతుక్కుపోతుంది. దాన్ని ఇతర కాల్షియంతో అతుక్కోకుండా నివారించి, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా కాపాడుతుంది. ప్రధానమైన యాంటీ ఆక్సిడెంట్లలో విటమిన్‌సి ఒకటి. ఇది నిమ్మలో ఎక్కువగా ఉంటుంది. నిమ్మలో అలర్జీని నివారించే గుణాలు కూడా ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది. నిమ్మలో విటమిన్‌సి మాత్రమే కాదు. విటమిన్‌ ఏ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటివీ ఉన్నాయి.



Previous
Next Post »