మన శరీర పనితీరుపై హార్మోన్ల ప్రభావం చాలానే ఉంటుంది. ముఖ్యంగా మన గొంతుభాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి గురించి దాని పని తీరులో తేడాల వల్ల థైరాయిడ్ సమస్య వస్తుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి హైపోథైరాయిడిజం, ఈ రోజుల్లో ఇది ఎక్కువగా ఉంటున్నది. దీన్ని అదుపులో ఉంచాలంటే వైద్యలు సూచించి మాత్రలతోపాటు ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నీరసం, అలసట, మానసికంగా కుంగి పోవడం, బరువు పెరగడం, చల్లదనం భరించలేకపోవడం, అతినిద్ర, బద్ధకం, జుట్టు రాలిపోవడం, చర్మం పొడిబారడం, కండరాల నొప్పులు, ఏకాగ్రత లోపించడం వంటివి హైపో థైరాయి డిజం లక్షణాలు. ఇదో ఆటోఇమ్యూన్ సమస్య. అయోడిన్ లోపం, ఒత్తిడి, జీవన విధానంలో లోపాలు వంటివి కొన్ని కారణాలు. కొంతమందిలో ఇదీ కారణమని కూడా చెప్పలేం. ఈ సమ స్యలు అదుపు లో ఉంచా లంటే థైరా యిడ్ గ్రంథి పనితీరుని ఇబ్బంది పెట్టే పదార్థాలను తగ్గించాలి.
హైపోథైరాయిడిజం సమస్యకు మునగాకు పనిచేస్తుంది. మునగాకు పప్పు లేదా పచ్చడిని రోజూ తినాలి. గ్లాసు నీటిలో గుప్పెడు మునగాకుల్ని కషాయంలా కాచుకుని నిత్యం తీసుకున్నా కూడా థైరాయిడ్ పనితీరు మెరుగవుతుంది.
* శొంఠి కొమ్ములను కొద్దిగా నేతిలో వేయించి, చల్లారిన తరువాత చూర్ణంలా చేసుకోవాలి. అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో అరచెంచా శొంఠిపొడి, నెయ్యి కలిపి తినాలి. లేదా శొంఠి పొడితో కషాయం కాచుకోవాలి. 30 మి.లీ పరిమాణంలో రోజూ తీసుకోవచ్చు.
* శుద్ధ గుగ్గుల చూర్ణం 1-2 గ్రాములు, గోరువెచ్చటి నీటితో కలిపి తీసుకున్నా మార్పు ఉంటుంది.
EmoticonEmoticon