ముక్తికి సోపానం ఇదేనా ?





ఆత్మజడమైనచో ఘటము వలె అచేతనమగును. జ్ఞాన రూపమును జ్ఞానాశ్రయమును అంగీకరింపవలయును. అన్నదే బౌద్ధమతము బౌద్ధ దర్శనము బుద్ధ ప్రణీతము.

”అసద్వాఇదమగ్ర ఆసీత్‌, విజ్ఞానం యజ్ఞం తనుతే
ప్రజ్ఞాన ఘన ఏవైతేభ్యో, తాన్యేవ భూతాన్యను
వినశ్యతి నప్రీత్య, సంజ్ఞాస్తి”





వేదవాదముల ప్రకారము సుషుప్తికానందమయ కోశమున ప్రళయకాలిక మూల ప్రకృతిని శూన్యంగా తలచి అందుండి ప్రజ్వరిల్లే విజ్ఞానమయ కోశమును భూత భౌతిక విజ్ఞాయాత్మకముగ పరిగణనలోకి తీసుకొనవలెను. ముక్తికి సోపానము. క్షణిక విజ్ఞానాత్మ శూన్యమగు బౌద్ధ దర్శనము నుండి ముండిత శిరస్త్వ, పీతాంబర ధారిత్వ, పంచశీలానుయాయిత్వ, చైత్యవందనాది ధర్మాచరణముననాక్షణిక విజ్ఞాన సంతతి, పరిణామ సంస్కార శూన్యతచే నిర్భీజమై పునః క్షణిక విజ్ఞాన శూన్యమై, ఒకానొక శూన్యభావనమే ముక్తి అనెడిది బౌద్ధుల సిద్ధాంతము. నాస్తికులకు భోక్తృభోజ్య సత్యత్వ దృష్టిని తొలగించుటకు ఇది ఉపకరించును.

కాలక్రమేణా జైన, బౌద్ధ చార్వక నాస్తిక దర్శనములు పర్యవేక్షణలో స్థూల సూక్ష్మకారణ శరీరములనే ఆత్మలుగా నిరూపించుతూ నిజ ఆత్మ దైవ దర్శన అద్వైతులకు దర్శన అభిలాష నాస్తికులకు కల్గించుటకు సహాయకారియే అద్వైత దర్శన దృష్టి. బౌద్ధుల సిద్ధాంత వాద ప్రకారము పృధ్వి జఠాగ్ని వాయువ్ఞలతో తోసుగా ఆకాశము కూడా ఒక భూతమే. దీనిలో అన్ని అణువ్ఞలే. పరమాణువ్ఞలు లేవ్ఞ.
పరమాణువ్ఞల కలయిక సామూహిక సమ్మేళనమే ఈ ప్రపంచము. బాహ్య ప్రపంచము భౌతికమే ఈ జగత్‌ అంతా స్కంధాలు అనుసంధానాలై పగ్గాలు పట్టి ముందుకు నడిపిస్తున్నాయి. రూప, విజ్ఞాన, వేదనా, సంజ్ఞా సంస్కారం స్కంధాలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.
విజ్ఞాన్కందము: నాది, నేను అనే ఆలయ విజ్ఞాన ప్రవాహ రూపమే విజ్ఞాన స్కందము. అందు ఆత్మ, చిత్తము అనే రెండు సంధాన కర్తలు వ్యవహరించుచుండును. ప్రపంచ దృష్టిలో బౌద్ధులు భిన్నంగా ఉండుటచే కాలక్రమేణా 1. మాధ్యమికులు-యోగాచారులు సౌత్రాంతికులు, వైభాషికులు అని పరిగణనలోనికి తీసుకున్నారు. వీరి సిద్ధాంతాలు.

సర్వము శూన్యమే, భాష్యము మాత్రమే శూన్యం
అంతరం మాత్రము శూన్యం కాదు.
బాహ్యర్థములు అనుమేయములని ప్రత్యక్షములే అని
ప్రపంచంను గూర్చిన భావన విశేషం చేతనే మోక్షము కలుగునని వీరి సిద్ధాంతము.







Previous
Next Post »