సత్యభామ ఆత్మవిశ్వాసం గల తరుణి. పుట్టినింట అల్లారు ముద్దుగా పెరిగింది. సౌందర్యరాశి. ధైర్యశాలి.
కృష్ణుని అష్టభార్యలలోనూ తనకో ప్రత్యేకత ఉండాలని తలపోస్తుంది. మాట మీరలేడు. నే గీసిన గీటు దాటలేడు అని కృష్ణస్వామిని తలచుకుని సత్యభామ మురిసిపోవడమే గానీ వాస్తవంలో ఇందుకు కొంత విరుద్ధంగానే జరుగుతుండేది. వేల మంది గోపికలను ముప్పు తిప్పలు పెట్టిన కృష్ణుడు సత్యభామ కళ్లు కప్పలేడా, చేసేదంతా చేసేసి ఏమీ తెలియనట్లు అమాయకుడిలా నటించేవాడు. ఆ వెర్రితల్లి నిజమనుకునేది. అంతా తెలుసుకుని చిర్రుబుర్రులాడేది. తప్పులుంటే దిద్దుకునేది. అందుకే సత్యాకృష్ణుల ప్రణయ కలహాలు అచ్చమైన వలపు పరిమళాలు. వారి ప్రేమానుబంధాలు స్వచ్ఛమైన హృదయ సుగంధాలు. సత్యభామ పేరు వినగానే అహంభావం గల స్త్రీ మూర్తి, దర్పం ఒలకబోసే ఇల్లాలు గుర్తుకు వస్తుంది. కానీ పెనిమిటిని చెప్పు చేతల్లో ఉంచుకోవాలన్న సగటు భార్యామణి. కోరిక తప్పు కానప్పుడు సత్యభామ వర్తన కూడా దోషం కాదనే చెప్పుకోవాలి. వినాయకచవితి నాడు పాలలో చంద్రుణ్ణి చూసినందుకు దేవకీసుతునీ మీద నీలాపనింద పడుతుంది.
సత్రాజిత్తు ఇంట ఉండాల్సిన శమంతకమణిని అపహరించాడన్న అపప్రధను ఆయన మోయాల్సి వస్తుంది. దాన్ని తొలగించుకోవడానికి కృష్ణ పరమాత్మ మణికోసం వెతుకులాడి జాంబవంతుని గుహలో ఉందని తెలుసుకుంటాడు. ఆ భల్లూక ప్రభువ్ఞతో పోరాడి ఆ మణిని సత్రాజిత్తుకు అందచేస్తాడు. ఆ మహారాజు శమంతకమణిని తన కుూర్తె సత్యభామా మణిని కూడా నీలమేఘశ్యామునికే కానుక చేస్తాడు. అలా కృష్ణుని జీవితంలోకి అర్ధాంగిగా ప్రవేశిస్తుంది సత్యభామ. సత్యభామ యోదానుయోధ అవసరంలో భర్తను ఆదుకున్న సబల. జీవిత భాగస్వామిని కంటికి రెప్పలా కాపాడుకున్న వీరవనిత. నరకాసురునితో యుద్ధం చేసి, ఆడపిల్ల వంటింటికి పరిమితం కాదని యుగాల నాడే నిరూపించిన ధీశాలి. అమ్మాయిలు ఏ రంగంలోనైనా నిలవగలరని, గెలవగలరని నిరూపించిన ఘనత నాడే సత్యభామ సొంతం చేసుకుంది. ఇలాంటి వారికి సహజంగానే స్వాభిమానం మెండుగా ఉంటుంది. సత్యాకృష్ణులు ఒకసారి వనవాసం చేస్తున్న పాండవ్ఞలను పకలరించేందుకు వెళ్లారు. భర్తను ఆకట్టుకునే మార్గంగానీ, మంత్రంగానీ చెప్పమంటూ ద్రౌపదిని చిన్న పిల్లలా అడిగింది సత్యభామ. ఏ మనిషినయినా మన మనిషిగా చేసుకునేందుకు ప్రేమాభిమానాలే శరణ్యమని ఇవి వినా మరో మార్గం ఉండబోదని ద్రౌపది స్పష్టం చేస్తుంది.
EmoticonEmoticon