మడ అడవుల పేరు చాలామందికి తెలిసే వుంటుంది. ఇది తీరానికి ప్రకృతి వేసిన రక్షణ. సముద్రపు ఆటుపోట్లు, తుఫాన్ ప్రభావాల తీవ్రతని తగ్గిస్తాయి. సముద్రప్రాణుల జీవవైవిధ్యాన్ని నిలుపుతాయి.
- తీరప్రాతంలో ఒక సమూహంగా లేదా పొదల రూపంలో గుబురుగా పెరిగే చెట్లే ఈ మ్యాన్‌గ్రూవ్స్..
- ప్రపంచవ్యాప్తంగా ముఫైఐదుకు పైగా మ్యాన్‌గ్రూవ్ మొక్కల రకాలు కనుగొనబడ్డాయి. వాటిలో వైట్ మ్యాన్‌గ్రూవ్, బ్లాక్ మ్యాన్‌గ్రూవ్, రెడ్ మ్యాన్‌గ్రూవ్, బాటమ్ వుడ్ మ్యాన్‌గ్రూవ్ నాలుగు రకాలు ప్రధాన రకాలుగా గుర్తింపుపొందాయి.
- ఎక్కువగా చిత్తడి నేలలు, నదీపరీవాహక ప్రాంతాల్లో వుండే ఈ వృక్ష సమూహాలు పక్షులు, చేపలతోపాటు ఇతర జంతుజాతులకి ఆహారాన్ని నివాసాలని కలిగించేవిగా వున్నాయి.
- మడ అడవులు గుబురుగా పొదల మాదిరి ఏపుగా పెరిగేందుకు ఇవి ఎక్కువగా నత్రజని, ఫాస్ఫరస్ లాంటి మూలకాలని ఎక్కువగా గ్రహించడమే కారణం.
- స్పానిష్ వలస వాదులు ఉప్పు శాతాన్ని ఎక్కువగా కలిగుండే మ్యాన్‌గ్రూవ్ ఆకులని ఆహారంలో మంచి రుచికోసం వినియోగించేవారు.
- ఔషద పరమైన లక్షణాలున్న మ్యాన్‌గ్రూవ్ బెరడుతో టీ తయారీ కోసం కొన్ని దేశాల్లో వీటిని ప్రత్యేకంగా సాగుచేస్తుంటారు.
- కొన్ని రకాల కీటకాలు పక్షులు, సాలీడుల నుండి కాపాడుకొనేందుకు మ్యాన్‌గ్రూవ్ ఆకుల ఆకారంలో ముడుచుకొని తమని తాము కాపాడుకుంటాయి.
- తెలుపు, నలుపు మ్యాన్‌గ్రూవ్ మొక్కలకి పూచే పూలలో'నెక్టార్' అనే పదార్థం ఉంటుంది. తేనె తయారీలో 'నెక్టారే' కీలకం.
- ఈజిప్ట్‌లోని కైరోలో వాడి ఆల్ హితాన్ ప్రాంతంలో 40 మిలియన్ సంవత్సరాల నాటి మ్యాన్‌గ్రూవ్ శిలాజాలు ఇప్పటికీ మనకి దర్శనమిస్తాయి.
- ఎక్కువగా ఇసుక ద్వీపాలు ఏర్పడేది ఈ మడ అడవుల ద్వారానే..
- వీటికి ఇతర చెట్లలా కాకుండా ఉప్పునీటికి తట్టుకునే ఓ ప్రత్యేక లక్షణం వుంది. సముద్రతీర ప్రాంతాల్లో ఇవి దట్టంగా పెరగడానికి ఈ ప్రత్యేక లక్షణమే కారణం.
- పగడపు దిబ్బల్లో పెరిగే జీవరాసులు, చిన్న చిన్న మొక్కలకి ఆక్సిజన్‌ని అందించడంలో ఎక్కువగా ఇవి తోడ్పడతాయి.
- ఉష్ణ, ఉప ఉష్ణ మండలాలతోపాటు ఆసియా, ఆఫ్రికా, నైరుతి పసిఫిక్ ప్రదేశాల్లో మనకి మడ అడవులు ఎక్కువగా కనిపిస్తాయి.
- దట్టంగా, చిక్కుబడి వుండే మ్యాన్‌గ్రూవ్ వేర్లు నీటిలోని ధూళిని సేకరించడం ద్వారా ఎక్కువ శాతం దీవులు తయారవుతుంటాయి.
- వీటి వేర్లు వరదలు, సునామీల తీవ్రతని అడ్డుకునే శక్తిని కలిగుంటాయి.
- వీటి వేర్లలో వుండే టాన్నిస్ అనే పదార్థంతోపాటు తీరప్రాంతాల్లో హార్బర్‌లని ఏర్పాటుచేసుకునేందుకు వీటిని వినియోగించడంద్వారా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇవి కనుమరుగవుతున్నాయి.
- భారత్, బంగ్లాదేశ్ తీరంలో ఉండే సుందరవనాల ప్రాంతం మడ అడవుల్లో పెద్దది. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా జిల్లాల తీర ప్రాంతాల వెంబడి కూడా వున్నాయి.
EmoticonEmoticon