అవిస గింజల గురించి పూర్తిగా తెలుసుకోండి

about flax seeds in telugu about flax seeds in hindi about flax seeds in tamil about flax seeds in kannada about flax seeds weight loss flaxseed oil flaxseed for hair flaxseed side effects about flax seeds benefits about flax seed all about flax seeds information about flax seeds e flax seeds i grind flax seeds m&s flax seeds are flax seeds good for u 1 tbsp flax seeds calories 1 tsp flax seeds calories 1 cup flax seeds in grams 1 tbsp flax seeds in grams 1 tsp flax seeds nutrition 1 kg flax seeds 2 tbsp flax seeds in grams 2 tbsp flax seeds 5 facts about flax seeds



అవిస గింజల గురించి పూర్తిగా తెలుసుకోండి 

అవిసె గింజలు మేలురకం కొవ్వులకీ, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలకు పెట్టింది పేరు. వీటిని తినడం వల్ల స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ లోపం లేకుండా ఉంటుంది. దీనిలోని అల్ఫాలినోలెనిక్ అనే పోషకం కండరాలకు బలాన్ని ఇస్తుంది.


1. బరువు తగ్గిస్తాయి

అవిసె గింజలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. వీటిలోని కరిగే పీచుపదార్థం ఆకలి మరియు తినాలనే కోరికను అణచివేయడానికి సహాయపడుతుంది. అవిసె గింజలలో గల పీచుపదార్థం వల్ల కడుపు నిండినట్లు అనిపించి శరీర బరువును తగ్గిస్తుంది.


వీటిలో అధిక స్థాయిలో మ్యుసిలెజ్ గమ్ కంటెంట్ ఉంటుంది. ఈ రకమైన పీచు పదార్ధం నీటిలో కరిగే గుణం కలిగి ఉంటుంది. దీనివల్ల ప్రేగులలో అద్భుతమైన లాభాలను కలిగిస్తుంది. ఇది శరీరంలో అధిక కొవ్వును తగ్గించుకోవడానికి ఉపయోగ పడుతుంది. పీచుపదార్థం అధికంగా ఉండడం వల్ల నెమ్మదిగా జీర్ణం అవుతుంది, తద్వారా ఎక్కువ సార్లు పిండి పదార్థాలు తినాలన్న కోరికను తగ్గిస్తుంది (1).


2. రక్తపోటు లేదా బిపి ని నియంత్రిస్తాయి

అధిక రక్తపోటు (హై బిపి) తగ్గించడానికి ఈ అవిసె గింజలు ఎంతో ఉపయోగపడతాయి. ఒక కెనడా పరిశోధనలో ప్రతీరోజూ 30 గ్రాముల అవిసెగింజలను తీసుకోవడం వల్ల 17% రక్తపోటు తగ్గుతుందని తేలింది.


3. మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి


అవిసె గింజలను రోజూ తీసుకోవడం వలన మధుమేహంతో బాధపడే వ్యక్తుల ఆరోగ్యం నిదానంగా మెరుగుపడుతుంది. 20 శాతం వరకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి. మరీ ముఖ్యంగా ఈ గింజలలోని ముసిలేజ్ జీర్ణక్రియను నెమ్మదిపరచి రక్తంలో గ్లూకోజ్ కలవడాన్ని నియంత్రిస్తుంది. అవిసె గింజలను తరచు తీసుకుంటే టైప్ 2 మరియు టైప్ 1 మధుమేహాలు రావడం ఆలస్యమయ్యేలా చేస్తుందని ప్రాధమిక అధ్యయనాల్లో తేలింది


4. జలుబు, దగ్గును నివారిస్తాయి

అవిసె గింజలు జలుబు, దగ్గులను నివారించడానికి కూడా అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడతాయి. 2-3 చెంచాల అవిసె గింజలను ఒక కప్పు నీటిలో నీరు బాగా చిక్కగా అయ్యేవరకు ఉడికించి వడకట్టిన చిక్కని నీటికి 3 చెంచాల నిమ్మరసం మరియు 3 చెంచాల తేనే కలిపి తీసుకోవాలి.


5. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి

జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం లో ప్రచురించిన ఒక అధ్యయనంలో ఆహారంలో అవిసెగింజల్ని జోడించడంవలన సహజంగా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని కనుగొన్నారు. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మరియు మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.


6. గుండె జబ్బులను నివారిస్తాయి

కొన్ని పరిశోధనలను బట్టి అవిసె గింజలలో ఒమేగా-3, యాంటి-ఇన్ఫ్లమేటరీ స్వభావాలు ఉంటాయని తెలిసాయి. అందువల్ల తరచుగా వీటిని తీసుకోవడం వల్ల హృదయ స్పందన సమతుల్యం అవుతుందని వెల్లడైంది. అవిసె గింజల్లోని లిగ్నన్స్ కూడా గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం


7. ఆర్థరైటిస్ ను తగ్గిస్తాయి

అవిసె గింజలలో గల ఒమేగా-3, యాంటి-ఇన్ఫ్లమేటరీ స్వభావాలు కీళ్ల నొప్పులు, వాపులు, ఆర్థరైటిస్ లను తగ్గించడానికి ఉపయోగ పడతాయి (5). వేయించి పొడిచేసి అవిసె గింజల పొడిని అన్ని ఆహార పదార్ధాలలోనూ కలపవచ్చు.


8. గర్భధారణ లేదా ప్రెగ్నెన్సీ సమయం లో

గర్భధారణ సమయంలో అవిసెగింజలను తీసుకోవడం వల్ల ఆ సమయంలో కలిగే మలబద్దకాన్ని పోగొట్టవచ్చు. ఈ గింజలలో ఉండే పోషకాలు గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయి. కానీ కొన్ని వివాదాస్పద ఋజువులున్నందువల్ల వీటిని డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవడం మంచిది.


9. క్యాన్సర్ వ్యాప్తిని అరికడతాయి

అవిసె గింజలను తరచుగా ఆహారంలో తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని ఎన్నో పరిశోధనలలో తేలింది. అంతేకాక అవిసె గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మరియు యాంటి-ఇన్ఫ్లమేటరి గుణాలు ఎన్నో రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి.అవిసె గింజల వాడకం వల్ల రొమ్ము కాన్సర్, ఒవెరియన్ కాన్సర్, ప్రోస్టేట్ కాన్సర్, పెద్దప్రేగు కాన్సర్ వంటి కొన్ని కాన్సర్ ల నుండి కూడా కాపాడగలదని కొన్ని పరిశోధనల్లో నిరూపితమైంది. క్లినికల్ క్యాన్సర్ రీసెర్చ్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, అవిసె గింజలు వాడకం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కనుగొన్నారు (6).


లిగ్నన్స్ కూడా కాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయని తేలింది. పరిశోధనల్లో అవిసె గింజలు ఏ విధంగా ప్రోస్టేట్ క్యాన్సర్ను తగ్గిస్తాయనేది కూడా నిరూపించబడింది.


10. ఫంగల్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్, ఈస్ట్ ఇన్ఫెక్షన్, గొంతునొప్పి, చెవినొప్పి, పన్ను నొప్పి, ఆస్తమా తగ్గించటానికి ఉపయోగపడతాయి

అవిసె గింజలను ప్రతీ రోజూ ఆహారంలో భాగంగా చేయడం వలన అవిసె గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మరియు ఏంటి ఇన్ఫ్లమేటరి గుణాలు రకరకాల ఇన్ఫెక్షన్స్ ను తగ్గించడానికి దోహద పడతాయి, మరియు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.


11. గ్యాస్ట్రిక్ సమస్యలను, జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి


అవిసె గింజల్లోని పీచు పదార్ధాలు జీర్ణాశయం పనితీరును మెరుగుపరచి గ్యా స్ట్రిక్ సమస్యలను త్తగ్గించడంలో సహాయపడతాయి. అవిసె గింజల పొడిని ఆహారంలో కలిపి తీసుకోవడం వల్ల మలబద్దకం కూడా తగ్గుతుంది.


అవిసె గింజల వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు

అవిసె గింజల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చర్మ ఆరోగ్య మరియు సౌందర్యానికి బాగా దోహదం చేస్తాయి. అవి చర్మాన్ని తేమగా మరియు మృదువుగా చేస్తాయి. కాలుష్య కారకాలు మీ చర్మ రంధ్రాలలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. చర్మం లోని తేమను అవి కాపాడతాయి. తద్వారా చర్మం పై ముడతలు పోతాయి. చర్మాన్ని తేమగా ఉంచి పొడిబారడాన్ని నిరోధించి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.


12. మొటిమలు తగ్గుతాయి

అవిసె గింజలు చర్మం గ్రంథులు ఉత్పత్తి చేసే ఒక జిడ్డు పదార్ధం సిబం ఉత్పత్తిని నియంత్రిస్తాయి. తద్వారా మొటిమలు రాకుండా అరికడతాయి. ప్రతీ రోజూ 1-2 స్పూన్ల అవిసె గింజలను తీసుకోవడం ద్వారా మొటిమలను అరికట్టవచ్చు.


13. తామర, సోరియాసిస్ లేదా బొల్లి మరియు ఇతర చర్మ వ్యాధుల తగ్గుదలకు ఉపయోగపడతాయి

పొడి చర్మం కూడా సోరియాసిస్ మరియు తామర వంటి ఇతర చర్మ వ్యాధులకు కారణమవుతుంది. ఇవన్నీఅవిసె గింజల ద్వారా నిరోధించబడతాయి.


అవిసె గింజల నూనెను చర్మంపై మర్దన చేయవచ్చు లేదా అవిసె గింజలను ప్రతీ రోజూ తినవచ్చు. ఏది చేసినా కూడా ప్రయోజనం కలుగుతుంది. వీటి యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా చర్మానికి చికిత్స చేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కాన్సర్ ను కూడా నిరోధించడానికి సహాయపడతాయి.


14. వయసు వల్ల ముఖంపై వచ్చే ముడతలను తగ్గిస్తుంది

ఒక టీస్పూన్ అవిసె గింజల నూనెకు రెండు టేబుల్ స్పూన్ల ముడి తేనె, ఒక టీస్పూన్ తాజా నిమ్మరసం కలిపి ముఖంపై రోజూ ఉదయాన్నే ఫేస్ ప్యాక్ లాగా వేయాలి. దీనివల్ల చర్మం పై ముడతలు పోతాయి మరియు చర్మం మెరుస్తుంది.


అవిసె గింజలను స్క్రబ్ లా కూడా వాడవచ్చు. అవిసె గింజల పొడిని ఒక టేబుల్ స్పూన్ తేనెలో కలిపి మొహానికి పట్టించి బాగా రుద్ది పదినిమిషాలపాటు వదిలేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోయి చర్మ రంధ్రాలు తెరుచుకొని చర్మం తాజాగా మారుతుంది.


అవిసె గింజల వల్ల జుట్టుకి కలిగే ప్రయోజనాలు

అవిసె గింజలలో ప్రోటీన్, కాల్షియం, జింక్, మెగ్నీషియం, ఇనుము మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలూ ఉంటాయి. అవిసె గింజలను రోజూ తీసుకోవడం వలన జుట్టు ఆరోగ్యంగా బలంగా ఉంటుంది.


15. జుట్టు ఊడటం తగ్గుతుంది

ఆహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు తక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అవిసె గింజలను ఆహారంలో తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించి అందమైన ఆరోగ్యమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.


అవిసె గింజలతో హెయిర్ జెల్ కూడా తయారు చేయవచ్చు. రెండు కప్పుల నీటిని మరిగించి దానిలో నాలుగు స్పూన్ల అవిసె గింజలను వేసి 15-20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మంటను ఆపేసి, ఆ ఉడికిన మిశ్రమాన్ని వడకట్టిన జెల్ ను ప్రతిరోజూ ఉదయాన్నే జుట్టుకు పట్టించి 20 నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి.


అవిసె గింజల ప్రయోజనాలు తెలుసుకున్నాం ఇప్పుడు వాటిలోని పోషక పదార్థాల గురించి తెలుసుకుందాం.


అవిసె గింజలు యొక్క పౌష్టిక విలువలు

అవిసె గింజలలో అనేక పౌష్టిక విలువలు ఉన్నాయి. యూఎస్డిఏ నేషనల్ న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం, రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలలో ఉండే పోషక విలువలు:


110 కేలరీలు
6 గ్రాముల పిండిపదార్ధాలు
4 గ్రాముల ప్రోటీన్
8.5 గ్రాముల కొవ్వు
6 గ్రాముల పీచు పదార్ధం
0.6 మిల్లీగ్రాముల మాంగనీస్
0.4 మిల్లీగ్రాముల థయామిన్ / విటమిన్ బి1
80 మిల్లీగ్రాముల మెగ్నీషియం
132 మిల్లీగ్రాముల భాస్వరం
0.2 మిల్లీగ్రాముల రాగి
5 మిల్లీగ్రాముల సెలీనియం
అవిసె గింజలు యొక్క రకాలు

అవిసెగింజలు రెండు రకాలు. గోధుమ మరియు బంగారు రంగు.


ఈ రెండు రకాలూ కూడా సూపర్మార్కెట్ మరియు ఆరోగ్య దుకాణాల్లో సులభంగా లభిస్తాయి. ఇంతే కాక అవిసె గింజల నూనె కూడా దొరుకుతుంది.


ఇప్పుడు అవిసె గింజలను తినడానికి సరైన విధానాలు తెలుసుకుందాం.


అవిసె గింజలను తినడానికి సరైన విధానాలు

అవిసె గింజలను తినడానికి ఉత్తమమైన మార్గం మొలకలు. నానబెట్టి మొలకెత్తించిన అవిసె గింజలను తీసుకోవడం ద్వారా వాటిలోని పోషకాలను పూర్తి స్థాయిలో పొందవచ్చు. వీటిని కేవలం 10 నిమిషాలు నానబెడితే చాలు మొలకెత్తడానికి.

వీటిని పొడిచేసి తీసుకోవడం మంచిది. ఎందుకంటే గింజలను అదే విధంగా తింటే వీటిలోని పోషకాలను మన శరీరం పూర్తిగా అందుకోలేదు.

వీటిని తినేటప్పుడు చాలా ఎక్కువ నీరు తాగటం మర్చిపోవద్దు.

ప్రొద్దుటి అల్పాహారాలలో ఈ అవిసె గింజలను భాగం చేయవచ్చు. స్మూతీలు, సాండ్విచ్ లు, సలాడ్లలో కలపవచ్చు.

అవిసె గింజల నూనెను వేడి చేయరాదు. వేడి చేస్తే దానిలోని పోషకాలు తగ్గిపోతాయి. కానీ ఆశ్చర్యకరంగా గింజలను వేడి చేస్తే ఏమీ కాదు. అవిసె గింజలను హాయిగా వేయించుకొని తినవచ్చు.

పోషకాలు తగ్గవు. పైగా ఎంతో రుచికరంగా ఉంటాయి.

వీటిని తీసుకోవడానికి అత్యుత్తమ సమయం ఉదయం. అల్పాహారంలో వీటిని తీసుకోవడం ఎంతో మంచిది.

ఈ విధంగా అవిసె గింజలను తీసుకోవాలి. కానీ వీటిని చాలా ఎక్కువగా తినడం వల్ల అనవసరపు దుష్ప్రభావాల బారిన పడతారు.


అవిసె గింజలు తింటే కలిగే దుష్ప్రభావాలు ఏమిటి? అవిసె గింజలను ఎవరు తినకూడదు?

అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి కాబట్టి, డయాబెటిస్ ఔషధాలను తీసుకొనే వ్యక్తులు వీటిని తీసుకొంటే చక్కెర స్థాయి మరింత తగ్గి ఇబ్బంది పడవచ్చు.

వీటిని తింటే బ్లడ్ ప్రెషర్ కూడా చాలా తగ్గుతుంది కనుక బిపి మందులు వేసుకొనే వారు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

ఇది హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. కాబట్టి సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు తీసుకోకపోవడం మంచిది.

ఇది ఈస్ట్రోజెన్ ను అనుకరిస్తుంది. అందువల్ల గర్భిణులు, పాలిచ్చే తల్లులు తీసుకోకపోవడం మంచిది.

అవిసె గింజలను ఎలా నిల్వ ఉంచాలి

అవిసె గింజలను సరిగ్గా నిల్వ చేసినట్లయితే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. మొత్తం అవిసె గింజలను కొనుగోలు చేసి ఇంట్లోనే వాటిని వేయించి పొడి చేసుకోవడం మంచిది. అవిసె గింజలు చల్లని మరియు పొడి ప్రదేశాల్లో నిల్వ చేయబడతాయి. అవిసె గింజలో ఉండే నూనె అసంతృప్తకరమైన కొవ్వు వల్ల సరిగ్గా నిల్వ చేయనట్లయితే, అవి పులిసిపోయినట్లుగా మారిపోతాయి. అవిసె గింజలని గాలి చొరబడని డబ్బాలలో నిల్వ చేస్తే సులభంగా సంవత్సరంపాటు నిల్వ ఉంటాయి .


చివరిగా

అవిసె గింజలు సులభంగా దొరుకుతాయి, సులభంగా వాడవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మంచివి. అవిసె గింజలను తప్పక మీ భోజనంలో చేర్చండి.

Previous
Next Post »