శూన్యం లో మంట ఎలా ప్రవర్తిస్తుంది ?


గురుత్వాకర్షణ శక్తి శూన్యం గా ఉన్న ప్రదేశం లో మంటలు వ్యాపించవు ... సరికదా ఆరిపోవును . మంట నుంచి కాంతి , ఉష్ణము , కార్బండై ఆక్శైడ్(carbondiaxide) ,నీటి ఆవిరి వెలువడుతాయి . ఉష్ణం వల్ల కలిగిన దహన చర్య తో కార్బండై ఆక్శైడ్ , నీటి ఆవిరి వ్యాకొచిస్తాయి . . . దాంతో వాటి సాంద్రత తగీ అవే తేలికై మంట పైభాగం నుంచి వాతావరణం లోకి చేరుకుంటాయి. ఈ ప్రక్రియలో ప్లవనము(buoyancy), సంవహనము (convection) అనే భౌతిక చర్యలు ఉంటాయి . ఆ విధంగా మంట లోపలి భాగం లో ఖాళీ ఏర్పడటం తో ఆ ప్రదేశానికి వాతావరణం లోని ఆక్షిజన్ తో కూడుకున్న గాలి చేరుకుంటుంది . ఆక్షిజన్ వల్ల మంట తీవ్రత మరీ ఉద్రుతమవుతుంది . . కాని సాన్ద్రతల తేడాల వల్ల తేలికైన పదార్ధాలు పైకి పోవడానికి గురుత్వశక్తి తోడ్పాటు అవసరము . కాబట్టి శూన్య గురుత్వం ఉన్నా ప్రదేశం లో ప్లవన, సంవహన చర్యలు జరుగవు ...

ఫలితంగా వేడెక్కి వ్యాకోచించిన కార్బండై ఆక్శైడ్ , నీటిఆవిరి మంట పైభాగం నుంచి వాతావరణం లోకి పోకుండా మంట చుట్టూ గుమికూడడం వల్ల వాతావరణం లోని ఆక్షిజన్ తో కూడిన గాలి మంటను చేరుకోలేదు ... దాంతో దహన చర్య సరిగా జరగకపోవడం తో చివరకు మంట కాస్తా ఆరిపోవును . అతి తక్కువగా గురుత్వ శక్తి ఉండే ప్రదేశాలలో మంట ఒక చిన్న గోళాకార రూపం లోకి కుచించికొని పోవడం తో వంట వ్యాపించదు . అందువల్లే రోదసీలో పయనించే అంతరిక్ష నౌక లో అగ్ని ప్రమాదాలు సంభవించిన అవి నలుమూలలకు వ్యాపించవు 
Share This :sentiment_satisfied Emoticon