సూర్యుని ఉపరితలం తో పాటు చుట్టూ ఉండే వాతావరణాన్ని - కాంతి మండలం (Photosphere) , వర్ణ మండలం (Chromosphere) , కాంతి వలయం (Corona) అనే మూడు భాగాలు గా విభజించ వచ్చు . సూర్యుని వాతావరణం లో అట్టడుగున ఉండే కాంతి మండలం ఉష్ణోగ్రత 5500 కేల్విన్లు ఉంటే , వర్ణ మండలం లో ఉష్ణోగ్రత ౪౫౦౦ కేల్విన్ల నుండి 10,000 కేల్విన్లు వరకు ఉంటుంది . ఈ మండలం తన కింద ఉండే కాంతి మండలం లో ఉత్పన్నమైన ఉష్ణం వల్ల వేడెక్కుతుంది .. కరోనా సూర్యుని వాతావరణం లోని చివరి ఉపరితల పొర . దీని ఉష్ణోగ్రత 2,౦౦౦,౦౦౦ .కేల్విన్ల నుండి 5,౦౦౦,౦౦౦ కేల్విన్ల వరకు ఉంటుంది . కరోనా లో ఉష్ణానికి కారణం సూర్యునిలో ఉండే "కరోనియం" అనే మూలకము.
కాంతి మండలాన్ని సలసల మరుగుతున్న నీటి ఉపరితలం తో పోల్చవచ్చు . ఇక్కడ అత్యంత ఉష్ణోగ్రతలో ఉన్న ప్రవాహి ద్రవ్యం (Fluid) పైకి , కిందికి ఎగిసి పడుతూ విపరీతమైన శబ్దం కలిగి ఉంటుంది . ఈ శబ్దతరంగాలు కరోనాలోకి చొచ్చుకొని రావడం తో అక్కడి ఆ ధ్వని శక్తి ఉష్ణ శక్తి గా మారుతుంది . కరోనా లో ఉన్న పదార్ధం కాంతి మండలం లోని పదార్ధం తో పోలిస్తే అతి సుక్ష్మమ గా పల్చగా ఉండటం తో అక్కడకు చొచ్చుకొని వచ్చిన ధ్వని శక్తి ఉత్పాదించిన ఉష్ణ శక్తి వల్ల ఆ పొర అతి త్వరగా , సులభం గా వేడెక్కుతుంది . దీనితో కరోనా లోని ఉష్ణోగ్రత సూర్యుని అంతర్భాగం లోని ఉష్ణోగ్రత కన్నా ఎన్నోమిలియన్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది . సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడినపుడు కరోనా తీవ్రత , తీక్షణ లను ప్రకాశవంతమైన తెలుపు రంగులో సునిశతం గా చూడవచ్చును . ఆ స్థితి నే " డైమండ్" రింగ్ అంటారు .
2 Comments
Write Commentsమంచి విషయాలు చెబుతున్న ఆసక్తికరమైన బ్లాగు. అభినందనలు.
Replyకాని ఇక్కడ నిత్యం కుప్పలుతెప్పలుగా కనిపించే అక్షరదోషాలు భరించటం శక్యం కావటం లేదు.
" డిమాండ్" రింగ్ ఏమిటండీ?
డైమండ్ రింగ్ కదా?
దయచేసి భాషకు కూడా కాస్త విలువ ఇవ్వండి.
థాంక్స్ శ్యామలరావు గారూ. రింగ్ (ఉంగరం) అంటే జనాల్లో ఎంత “డిమాండ్” ఉన్నప్పటికీ ఇక్కడ సూర్యుడి గురించిన పోస్ట్ లో “డిమాండ్ రింగ్” ఏమిటో నాకు అర్థం కాలేదు. “డైమండ్” అనా వీరి భావం? ఆహా!
Reply“శ” ని “ష” గా పలకడం మాత్రం బాగా అబ్బింది ఈ తరం వారికి. పలకడమే కాదు, వ్రాతలో కూడా “ష” వ్రాస్తారని ఇక్కడ కనిపిస్తున్న “సునిషితం” అనే పదాన్ని చూస్తే బోధపడింది 😡.
ధన్యోస్మి 🙏.
EmoticonEmoticon