జాతస్య మరణం ధృవం. పుట్టిన వారికి మరణం తప్పదు; మరణించిన వారికి జన్మం తప్పదు. తమ ఆత్మ బంధువు, స్నేహితుడు మరణించినప్పుడు ఆఖరి చూపు కోసం ఎందరో ఆ ఇంటికి వెళతారు. ఆ కుటుంబీకులను ఓదారుస్తారు. ఆ రాత్రి వారికి సాయంగా ఉండాలని వారికి అనిపిస్తుంది; కానీ మృతుని ఇంటి దీపాన్ని (చీకటి పడిన తరువాత వెలిగించిన దీపం) చూడరాదు... అనే నియమాన్ని అనుసరించి చీకటి పడకుండానే తిరిగి ప్రయాణం అవుతారు.
ఈ విధమైన నియమం పెద్దలు ఏర్పరచడానికి కారణం?...మరణించిన ఇంటి పెద్దను చూడడానికి ఎక్కడెక్కడినుండో బంధుమిత్రులు వస్తారు. ఇంటి పెద్ద పోయిన దుఃఖం లో ఉన్న వారు... వచ్చిన వారికి కనీస మర్యాదలు చేసే స్థితిలో ఉండరు. ఆ రాత్రి ఉందామను కొనే వారికి సౌకర్యాలు సమకూర్చలేరు. పైగా వారికి ఆర్ధిక భారం. కొందరు చుట్టాలు వఛ్చి తిష్ట వేస్తే ఓ పట్టాన పోరు. వారికి ఇతరుల సాధక బాధలు పట్టవు....ఇంత అర్ధమయ్యేలా చెబితే ఎవరు వింటారు?... అందుకే ఆ ఇంటి దీపం చూడ కుండా చీకటి పడకుండా వెనుతిరగాలి.... అనే నియమం ఏర్పరిచారు.
మరణించినప్పుడు రాలేనివారు చిన్న కర్మ రోజున గాని, పెద్ద కర్మ రోజున గాని వస్తారు... అప్పుడు కూడా ఇదే నియమం. వచ్చిన బంధు మిత్రులు భోజనాలు చేసి సూర్యాస్త మయంలోపు తిరుగు ప్రయాణమౌతారు..అలాగే మరణించిన ఇంటి వారి గడప తొక్కినవారు వేరే ఇంటికి వెళ్ళకూడదు అనే నియమం కూడా ఇలాంటిదే... మృత శరీరాన్ని తాకడం లేదా దగ్గరి బంధువులను తాకడం వల్ల ముట్టుకున్న వారికి ఆసౌచం వస్తుంది..వెంట తీసుకెళ్లిన బట్టలు అన్నీ తడపాలి.
ఇంటికి వెళ్లి స్నానం తప్పనిసరిగా చేయాలి.. వూరు కాని వూరిలో ఇవన్నీ ఎలా కుదురుతాయి?. వేరే స్నేహితులు ఉన్నా, వారికి ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాము... అందుకే ... ముందు తెలిసిన వారి ఇంటికి వెళ్లి మన బట్టల సంచి, సామాను వారి ఇంటిలో పెట్టి మృతుని ఇంటికి వెళ్లి పరామర్శించి తిరిగి తెలిసిన వారి ఇంటికి వచ్చి స్నానం చేసిన తరువాత పసుపు నీళ్లు చల్లుకొని మన బట్టల సంచి తాకితే దోషం ఉండదు.
EmoticonEmoticon