Uncategories
వంట ఇంటి చిట్కాలు
వంట ఇంటి చిట్కాలు
- వంటగదిలో మూలలలో, అక్కడి అల్మారాల్లో కాస్త బోరిక్ పౌడరు చల్లితే బొద్దింకల బెడద తీరుతుంది.
- మీ ఇంట్లో బల్లుల బెడద ఉంటే ఒక్కో గదిలో ఒక నెమలి ఈకను వేలాడ కడితే బల్లులు పారిపోతాయి.
- పాల గిన్నెలో ఒక చెంచా వేసి సన్నని సెగ మీద కాస్తే పాలు అడుగంటవు.
- ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే 5 పచ్చకర్పూరం బిళ్ళలను కప్పు నీళ్ళలో వేసి అన్ని గదుల్లో పెడితే దోమలు పారిపోతాయి.
- ఉల్లిపాయలు పాడు కాకుండా ఉండాలంటే ఒక్కో పాయను కాగితంలో చుట్టి గాలి, వెలుతురూ పడని చోట పెట్టాలి
- బియ్యం డబ్బాలో పేపరులో చుట్టిన బోరిక్ పౌడర్ ఉంచినా లేదా గుప్పెడు పుదీనా ఆకులు వేసినా ఆ బియ్యానికి పురుగు పట్టదు.
- బట్టల మీద పడిన టీ, కాఫీమరకలు పోవాలంటే ఆ మరకలను ఉప్పుతో రుద్ది ఉతకాలి.
- గుడ్డు పగిలి సొన కారితే వెంటనే దానిపై ఉప్పు చల్లి 2 నిమిషాలు ఆగి టిష్యుపేపర్ తో తుడిస్తే పూర్తిగా పోతుంది. వాసన కూడా రాదు.
- కార్పెట్ మిద మొక్కజొన్న పిండి చల్లి తరువాత వ్యాక్యూమ్ క్లినర్ తో శుభ్రం చేస్తే దుమ్ము పూర్తిగా పోయి కొత్తదానిలా మెరుస్తుంది.
EmoticonEmoticon