నేరుగా రోడ్డుపై పోతున్న బస్సు మలుపు తిరుగుతున్నప్పుడు మనం పక్కవారిపై ఒరుగుతామెందుకు?
సరళ మార్గంలో వేగంతో పయనిస్తున్న బస్సు లేదా రైలు తటాలున వక్రమార్గం (curved path)లోకి మలుపు తిరిగేప్పుడు ఏం జరుగుతుందో తెలియాలంటే న్యూటన్ గమన
సూత్రం అర్థం కావాలి. ఈ సూత్రం ప్రకారం, ఏదైనా ఒక వాహనం సరళమార్గం నుండి వక్రమార్గంలోకి పయనించాలంటే దానిపై కొంత బాహ్య బలం పనిచేయాలి. ఈ బాహ్యబలం వక్రమార్గ కేంద్రంవైపు పనిచేస్తుంది. అందువల్ల ఈ బలాన్ని అభికేంద్రకబలం (centrepetal force) అంటారు. ఈ బలం బస్సు విషయంలో దాని టైర్లకు, రోడ్డుకు మధ్య జరిగే రాపిడి లేక ఘర్షణ (friction) వల్ల లభిస్తుంది.
భౌతికశాస్త్ర నియమం ప్రకారం ఏ వస్తువుపైనైనా అభికేంద్రకబలం పనిచేస్తే అదే సమయంలో దానిపై అంతే పరిమాణంగల అపకేంద్రకబలం (centrifugal force) వ్యతిరేక దిశలో పని చేస్తుంది. వక్రమార్గంలో పయనించే బస్సు వెలుపల వైపునకు పనిచేసే ఈ అపకేంద్రక బలం ప్రయాణికులపై కూడా పనిచేస్తుంది. అందువల్లనే ప్రయాణికులు తమ సీట్లలోనే బస్సు మలుపు తిరిగిన దిశకు వ్యతిరేక దిశగా తమ పక్కనున్న ప్రయాణికులపైకి ఒరుగుతారు.
EmoticonEmoticon