పుత్తూరులో పుల్లయ్యకు నేతి మిఠాయిల కొట్టు ఉంది. చాలా ఏళ్లుగా నాణ్యత పాటిస్తూ అత్యంత రుచికరమైన, శ్రేష్టమైన మిఠాయిలను తయారుచేసి విక్రయించేవాడు. ఈ మూలంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు తన పేరు వ్యాపించింది.
పుల్లయ్య కృషి, సేవాభావం కలిసి అనతికాలంలో తనకొట్టు కోట్ల రూపాయల వ్యాపారానికి పాకింది. మొదట్లో తినడానికి తిండిలేని నిరుపేదగా ఉన్న సమయంలో చిన్నకొట్టును ప్రారంభించాడు. క్రమక్రమంగా వ్యాపారం విస్తరించి కళ్ల ముందు డబ్బులు కనిపించడంతో దురాశ పెరిగింది. వచ్చే ఆదాయాన్ని అంతా భార్యాబిడ్డల పేరున బ్యాంకుల్లో దాచాడు.
లెక్కకు మించి ఆస్తులు కూడబెట్టాడు. పులయ్యలో దుర్బుద్ధి పెరగడంతో అక్రమమార్గం పట్టాడు. తన వద్ద పనిచేసే కార్మికులకు ఇవ్వాల్సిన జీతభత్యాల్లో కోతపెట్టాడు. వారికి చట్టప్రకారం అందించాల్సిన సౌకర్యాలను విస్మరించాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే ”మీ పనిచాలా తక్కువ.. జీతం ఎక్కువ.. వ్ఞంటే వ్ఞండు.. పోతేపో.. అంటూ కఠినంగా మాట్లాడుతూ కార్మికుల సంక్షేమాన్ని మరిచి పనిగంటలు పెంచాడు. దీంతో కార్మికులకు పనిభారం పెరిగి మానసిక ఒత్తిడికి గురయ్యారు. పుల్లయ్యకు ఇదేమీ పట్టలేదు. పెత్తందారి భావం పుణికిపుచ్చు కోవడంతో ముందు చూపులేక అహంభావంతో ప్రవర్తించాడు. ”మీరెవరూ లేకపోయినా నా వ్యాపారానికి ఢోకాలేదు. మీ వల్ల ఏలాంటి లాభం లేదు. ఖర్చుతప్ప అంటూ అగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కార్మికులు తమ కుటుంబా కష్టాలను ఎవరికీ చెప్పుకోక పోయారు. నిరుత్సాహం ఆవరించింది.
పుల్లయ్య మిఠాయిల కొట్టు ఎదుటే మరో వ్యక్తి స్వీటు ప్రారంభించడంతో ఆ షాపు యజమాని కార్మికుల యోగక్షేమాలను తానే చేసుకుంటానని హామీ ఇవ్వడంతో కార్మికులందరూ మూకుమ్మడిగా అక్కడికి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా పుల్లయ్య కొట్టులో లడ్డూలు, జాంగిరీలు తయారీ ఆగిపోయింది. పక్కనే 50 కేజీలు లడ్డూల కోసం అర్డరిచ్చిన పెళ్లివారు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. లడ్డూలు వెంటనే కావాలని నిలదీశారు. పుల్లయ్యకు ఏమి చెయ్యాలో పాలుపోలేదు.
వెంటనే తానే స్వయంగా రంగంలోకి దిగాడు. లడ్డూలు చేసేటప్పుడు వేడిని భరించలేక చేతులు కాల్చుకు న్నాడు. తన భార్య ఇద్దరు పిల్లలు బడి మాని లడ్డూల తయారీలో నిమగ్నమయ్యారు. అయినా అనుకున్న సమయానికి పూర్తికాలేదు.
ఈ లోపు స్వీట్లు కోసం ఆర్డరిచ్చిన మరికొందరు తాము ఇచ్చిన అడ్వాన్సును వెనక్కితీసుకుని ”మాకు బుద్ధిలేక చేతకాని వాళ్లదగరిచ్చాం అని నిందిస్తూ వెళ్లిపోసాగరు. కళ్ల ఎదుటే వ్ఞన్న పేరు దిగజారుతుంటే అయోమయంలో పడ్డాడు పుల్లయ్య. మరో వైపు పిల్లలు బడి మానేయడంతో వారి చదువ్ఞలు కుంటు పడ సాగాయి. ఇక లాభం లేదకున్నాడు పుల్లయ్య. పరుగుపరుగున ఎదుట ఉన్న స్వీటుషాపు వద్దకు వెళ్లాడు.
కార్మికుల ముందు నిల్చున్నాడు. ” అయ్యా. మీకు నమస్కారాలు.. మీ కష్టం
చాలా ఎక్కువ. ప్రతిఫలం చాలా తక్కువ. ఇకనుంచి మీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను. దయచేసి మనషాపు వద్దకు వచ్చేయండి. అని చేతులు జోడించి దీనంగా ప్రాధేయ పడ్డాడు కార్మికులు కష్టం విలువ తెలుసొచ్చిన
పుల్లయ్య.
EmoticonEmoticon