చర్మం మరింత మెరిసేలా





చర్మం మరింత మెరిసేలా



బేబీ ఆయిల్‌ పేరులోనే అది పిల్లల కోసం తయారు చేసిందని అర్ధమైపోతుంది. కానీ అందాన్ని మెరుగుపరిచే సాధనాల్లో ఇది కూడా ఒకటి. 


ముఖానికి చేసుకున్న అలంకరణ తీసేయడానికి ఖరీదైన మేకప్‌ రిమూవర్‌లే వాడక్కర్లేదు. కొద్దిగా బేబీ ఆయిల్‌ని టిష్యూపై వేసుకుని ముఖం తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తేమ అంది ఆరోగ్యంగా ఉంటుంది. పొడి చర్మతత్వం ఉన్నవారు తడిపొడిగా ఉన్నప్పుడు ఈ నూనె రాసుకోవాలి. చర్మానికి తేమ అంది తాజాగా మారుతుంది.


కాలి పగుళ్లకు ఇది చక్కగా పనిచేస్తుంది. వ్యాక్సింగ్‌ చేయించుకున్నాక దద్దుర్లు రాకుండా ఉండాలంటే.. కొద్దిగా ఆ నూనె రాసి మర్దన చేస్తే చాలు. చర్మం సాంత్వన పొందుతుంది. మృదువుగానూమారుతుంది. కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడినప్పుడు ఈ ఆయిల్‌ని కొద్దిగా తీసుకుని అక్కడ మృదువుగా మర్దన చేస్తే సరి.


చర్మం సాంత్వన పొందుతుంది. మృదువుగానూ మారుతుంది. కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడినప్పుడు ఈ ఆయిల్‌ని కొద్దిగా తీసుకుని మృదువుగా మర్దనచేయాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే రక్తప్రసరణ సరిగ్గా జరిగి అవి పోతాయి. కొందరు పెదవులను తరచూ తడుపుతూ ఉంటారు. ఇంకొన్నిసార్లు వాతావరణం వల్ల రంగు మారడం, పగుళ్లూ, మృతకణాలు వంటివి ఇబ్బంది పెడతాయి. ఇలాంటప్పుడు బేబీఆయిల్‌లో కొద్దిగా తేనె, పంచదార కలిపి మృదువుగా రుద్దితే సరిపోతుంది.
Previous
Next Post »