నీటిలో సువర్ణ పొడి కలిపి శివునికి అభిషేకం చేస్తే ఫలితం ఏమిటి




శివలింగాలను పూజించడం వలన, అనేకరకాల ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే ఆ దేవదేవుడికి జరిపే అభిషేక ద్రవ్యాలను బట్టి కూడా ఫలితాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నాయి.








 ఈ నేపథ్యంలోనే 'సువర్ణ జలం'తో చేయబడే అభిషేకం ద్వారా దారిద్ర్య బాధలు తొలగిపోతాయి
కొద్దిగా సువర్ణ పొడి వేయబడిన జలంతో పరమశివుడిని అభిషేకించడం వలన దారిద్ర్యం నివారించబడుతుందని పండితులు చెప్తున్నారు.

దారిద్ర్యాన్ని దహించేవాడిగానే పరమశివుడుని పిలుస్తుంటారు. అలాంటి ఆ సదాశివుడిని సువర్ణ జలంతో అభిషేకించడం వలన దారిద్ర్యం తొలగిపోతుంది. అలాగే గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందవచ్చు.




పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము. ద్రాక్షరసముచే అభిషేకం చేస్తే.. ప్రతి కార్యంలో విజయం చేకూరుతుంది. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు.

Previous
Next Post »