బొప్పాయి చేసే మేలు




కరోనాను అడ్డుకునేది లాక్‌డౌన్‌. దాన్ని దాటుకొని వచ్చే వైరస్‌ను తిప్పికొట్టేది మనలోని రోగనిరోధక శక్తే! అందుబాటు ధరలో ఉండే పోషకాల గని బొప్పాయి. ఈ పండుకు మన ఆహారంలో చోటిస్తే చాలు.. తక్షణ రక్షణ సిద్ధిస్తుంది.






* బొప్పాయిలోని ఎ, సి, కె విటమిన్లు ఇమ్యూనో బూస్టర్లుగా పనిచేస్తాయి. శరీరంలోని కణజాల వృద్ధికి, చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతాయి.

* ఇందులో నీరు, పీచు తగిన ప్రమాణంలో ఉంటాయి. ఫోలిక్‌ ఆమ్లం, పొటాషియం, మెగ్నిషియం, కాపర్‌, జింక్‌ అదనపు శక్తినిస్తాయి.



* ఒక కప్పు (వంద గ్రాములు) బొప్పాయి తింటే 40 కెలొరీలు లభిస్తాయి. రోజులో మనకు అవసరమయ్యే విటమిన్‌-ఎలో 20 శాతం, విటమిన్‌-సిలో 70 శాతం లభిస్తుంది.
* తక్కువ కెలొరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు దీనిని హాయిగా తినొచ్ఛు 100 గ్రాముల బొప్పాయిలో చక్కెర ఎనిమిది గ్రాములే ఉంటుంది.




* కాలేయ సంబంధ వ్యాధులు, చర్మ సమస్యలు, వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటుందీ ఫలం.

* బొప్పాయిలోని పపైన్‌ అనే ఎంజైమ్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తరచూ గ్లాసు రసం తీసుకుంటే మలబద్ధకం ఉండదు.





* ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోనూట్రియంట్లు.. ఫ్రీరాడికల్స్‌తో పోరాడి గుండె జబ్బులు, క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.





Previous
Next Post »